చలికాలంలో ఈ పండును తినకపోతే మీ ఆరోగ్యం అంతే..?

మన శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వు, చెడు కొవ్వు రెండు కూడా ఉంటాయి.మన శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వు పెరిగితే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

 Do You Know The Health Benefits Of Eating Avocado In Winter Details, Avocado, Av-TeluguStop.com

ఆవకాడో( Avocado ) క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వు( Healthy Fat ) మన శరీరంలో ఉంటుంది.ఒక రకంగా చెప్పాలంటే దీనిని సూపర్ ఫుడ్ అని కూడా చెబుతూ ఉంటారు.

మీడియం సైజ్ ఉండే ఒక పండులో 19 గ్రాముల అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, 10 గ్రాముల ఫైబర్ తో సహా 13 గ్రాముల పిండి పదార్థాలు కూడా ఉంటాయి.అంతేకాకుండా దీనిలో విటమిన్ సి, పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు లాంటివి ఎన్నో ఉంటాయి.

అవకాడో లో ఉండే చాలా రకాల పోషకాలు గుండె జబ్బుల నుంచి రక్షిస్తాయి.

Telugu Avocado, Diabetes, Tips, Healthy Fat, Skin Problems, Vitamin, Fruit-Telug

మరోవైపు డైటరీ ఫైబర్ రక్తంలోనీ చక్కెరను అదుపులో ఉంచుతుంది.డయాబెటిస్( Diabetes ) ప్రమాదాన్ని కూడా దూరం చేస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే చలికాలంలో ఆవకాడో తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చెప్పాలంటే ఈ పండులో అధిక కేలరీ కంటెంట్ ఉన్నప్పటికీ బరువు తగ్గడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.చల్లని వాతావరణం చర్మం పై ( Skin ) ప్రభావం చూపుతుంది.

దీనివల్ల చర్మం పొడిబారడం, దురద రావడం వంటి సమస్యలు వస్తాయి.కొన్ని సందర్భాలలో తామర, అలాగే ఇతర చర్మ వ్యాధులు కూడా వస్తాయి.

ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాలతో నిండిన అవకాడో ను చలికాలంలో తినడం వల్ల చర్మాన్ని పొడి బారకుండా, చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది.

Telugu Avocado, Diabetes, Tips, Healthy Fat, Skin Problems, Vitamin, Fruit-Telug

ఈ పండు అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.అవకాడో లోని మరో కీలకమైన విటమిన్ విటమిన్ ఈ.( Vitamin E ) ఇది పొట్టలోని మంటతో పోరాడుతుంది.అదే సమయంలో గాయం నయం కావడానికి వేగవంతంగా పనిచేస్తుంది.ముడతలు పడిన చర్మాన్ని ఇది రక్షిస్తుంది.దీనిలో విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంటుంది.అంతే కాకుండా రక్తంలో చక్కెర స్థాయినీ క్రమాబద్ధీకరించడానికి, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ నొప్పులను దూరం చేయడానికి చలికాలంలో ఈ పండు ఎంతగానో ఉపయోగపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube