తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg boss telugu 7 ) రసవత్తరంగా సాగుతోంది.చూస్తుండగానే అప్పుడే ఎనిమిది వారాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో 9వ వారం ముగింపు దశకు చేరుకుంది.
ఇక ఈవారం డబ్బులు ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది.
ఇంటి సభ్యులను బిగ్ బాస్ రెండు టీమ్స్ గా విభజించాడు.వీర సింహాలు టీమ్ లో రతిక, గౌతమ్, శోభా, భోలే, యావర్, తేజ ఉన్నారు.
ఇక గర్జించే పులులు టీమ్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, అశ్విని, అర్జున్, అమర్ ఉన్నారు.టాస్క్ ప్రకారం సమయానుసారంగా పైపు నుండి పడే బంతులను సేకరించాలి.ఇరు టీమ్ సభ్యులు సంచుల్లో వాటిని నింపి ప్రత్యర్థుల నుండి కాపాడుకోవాలి.అదే సమయంలో బిగ్ బాస్ నిర్వహించే టాస్క్స్ లో పాల్గొనాలి.జంపింగ్ జపాంగ్ టాస్క్ లో వీర సింహాలు టీమ్ గెలిచింది.దాంతో గర్జించే పులులు టీమ్ నుండి ఒకరిని తప్పించే ఛాన్స్ వారికి దక్కింది.
వారు పల్లవి ప్రశాంత్( Pallavi prashanth ) ని తప్పించారు.దాంతో గర్జించే పులులు టీమ్ వీక్ అయ్యింది.
తాజాగా జరిగిన ఎపిసోడ్లో మరలా బంతులు పడ్డాయి.సేకరించించేకు ఇరు టీమ్స్ కి సంచులు కావాల్సి వచ్చాయి.
ముందుగా స్టోర్ రూమ్ లోకి వెళ్లిన అమర్ ప్రత్యర్థి టీమ్ సంచులు కూడా తీసుకున్నాడు.దాంతో గౌతమ్ ప్రతిఘటించాడు.సంచుల విషయంలో రతిక-అమర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.సంచులు ఎందుకు క్రింద పడేశావ్ అని రతిక అమర్ ని ప్రశ్నించింది.అది నా ఇష్టం నా స్ట్రాటజీ అన్నాడు.ఎదవ పని చేసి స్ట్రాటజీ అనకు అని రతిక అన్నది.
నువ్వు చేసేవి ఎదవ పనులు, నువ్వంటే ఊస్తున్నారు బయట అని అమర్ అన్నాడు.మాటలు జాగ్రత్తగా రానీ అని రతిక హెచ్చరించింది.
అమర్ కూడా తగ్గలేదు.ఇద్దరి మధ్య గొడవ పర్సనల్ వరకూ వెళ్ళింది.
అందుకు సంబంధించి ఫోటోలు, ప్రోమోలో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వాటిని చూసి అన్ని నెటిజన్స్ ఇద్దరిపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో తొమ్మిదో వారం ఎలిమినేషన్స్ లో భాగంగా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.