టాప్ 7 కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే.. ఎప్పుడు జరగబోతుందో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7( Bigg Boss Telugu Season 7 ) స్టార్ట్ అయ్యి సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది.ఇప్పటికే 11 వారాలు అయ్యి 12వ వారం కొనసాగుతుంది.

 Bigg Boss Telugu 7 Grand Finale To Be Held On 17th December, Bigg Boss 7 Telugu,-TeluguStop.com

ఈ వారంలో హౌస్ లో పోటీ రసవత్తరంగా జరిగింది.ముందుగా ఎంట్రీ ఇచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ లో పాటు మధ్యలో 5వ వారంలో 5 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు.

అలా ఈ సీజన్ లో మొత్తంగా 19 మంది కంటెస్టెంట్స్( 19 contestants ) రాగా వారిలో 10 మంది అమ్మాయిలు కాగా 9 మంది అబ్బాయిలు.మరి ఎక్కువుగా అమ్మాయిలే ఈ సీజన్ లో ఎలిమినేట్ అవుతూ రావడంతో 6 మంది బయటకు వచ్చేసారు.

ఇప్పుడు హౌస్ లో కేవలం నలుగురు మాత్రమే అమ్మాయిలు ఉన్నారు.

మొత్తంగా ఇప్పుడు హౌస్ లో 10 మంది సభ్యులు ఉన్నారు.వీరికి నామినేషన్స్ జరుగగా ఈ వారం 6 మంది నామినేట్ అయ్యారు.ఈ వీక్ మొత్తంగా డబల్ ఎలిమినేషన్ అని నాగార్జున ముందుగానే ప్రకటించారు.

దీంతో 13వ వారానికి హౌస్ లో 8 మంది మాత్రమే మిగులుతారు.ఇక ఇది ఉల్టా పుల్టా కావడంతో ప్రతీసారిలా కాకుండా ఈసారి కొత్తగా ఫినాలే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

కొత్తగా అంటే ఈసారి ఫినాలేలో టాప్ 5 కంటెస్టెంట్స్ తో కాకుండా టాప్ 7 కంటెస్టెంట్స్ తో( Top 7 contestants ) ఫినాలే ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.దీంతో గ్రాండ్ ఫినాలే కూడా డిసెంబర్ 17న ముహూర్తం ఫిక్స్ చేసారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.ఏడుగురు కంటెస్టెంట్స్ తో గ్రాండ్ ఫినాలేను అట్టహాసంగా నిర్వహించాలనే ఆలోచనలో బిగ్ బాస్ వారు ఉన్నారట.చూడాలి ఇందులో ఎంత నిజం ఉందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube