ప్రియాంకతో మానస్ పెళ్లి.. మధ్యలో అడ్డుపడ్డ తల్లి.. ఆఖరి నిమిషంలో ఊహించని ట్విస్ట్?

బిగ్ బాస్ కార్యక్రమం నేటితో ఏడవ వారాన్ని పూర్తి చేసుకోనుంది.ఈ క్రమంలోనే ఈ వారం కెప్టెన్ గా సన్నీ, రేషన్ కి కాజల్ సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే.

 Bigg Boss Telugu 5 Maanas Priyanka Best Compatible Couples , Priyanka , Manas, M-TeluguStop.com

ఇకపోతే శనివారం ఎపిసోడ్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు సరైన మ్యాచ్ వెతకండి అనే టాస్క్ ఇచ్చాడు.ఇందులో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు వారి జీవితంలోకి రాబోయే వారు ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలియజేశారు.

ఇలా ఒక్కో కంటెస్టెంట్ వారి జీవిత భాగస్వామి ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్పుకొచ్చారు.ఇక హౌస్ సభ్యులందరూ మాట్లాడిన అనంతరం జెస్సీ మినహా మిగతా వారందరూ కూడా సరైన జోడిగా మానస్, ప్రియాంకాలను ఎంపిక చేశారు.

దీంతో వారిద్దరూ పూలదండలు మార్చుకున్నారు.ఇదిలా ఉండగా వీరి పెళ్లి మధ్యలో అనీ మాస్టర్ ఎంటర్ అవుతూ… ప్రియాంక మానస్ ధ్యాసలో పడి ఆట ఆడటం మరిచిపోతుంది అని ఆందోళన చెందింది.

Telugu Biggboss, Manas, Priyanka-Movie

ఇక రవి మాట్లాడుతూ మానస్ మదర్ తనకు తెలుసని, ఈ విషయం ఆమెకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆందోళన చెందారు.ఇదిలా ఉండగా బిగ్ బాస్ సరైన మ్యాచ్ టాస్క్ లో భాగంగా ఎంపికైన మానస్ ప్రియాంక పెళ్లి జరగడంతో ప్రియాంక ఆనందంలో మునిగిపోయింది.ఇలా వీరిద్దరు దండలు మార్చుకున్న అనంతరం బిగ్ బాస్ గువ్వా గోరింక అనే పాటను వినిపించగా అద్భుతంగా డాన్స్ చేశారు.శనివారం ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు క్లాస్ పీకినట్టు తెలుస్తోంది.

మరి ఎలిమినేషన్ లిస్టు లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube