బుల్లితెర పై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.ఇలా బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సొహైల్ ఒకరు.
బిగ్ బాస్ కార్యక్రమంలో ఇతర కట్టేస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చిటాప్ త్రీ లో ఉండి బిగ్ బాస్ ఆఫర్ చేసిన 25 లక్షల గెలుచుకొని బయటకు వచ్చారు.ఇక ఈయన బయటకు వచ్చిన తర్వాత వరుస సినిమాలను ప్రకటిస్తూ సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు.
అయితే ఇప్పటివరకు ఈయన నటించిన ఏ ఒక్క సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు.
ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి కూతురు పవిత్రను కలిశారు.
ఈ క్రమంలోనే వారితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆకాష్ పూరి గురించి పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు.తాజాగా తాను ఆకాష్ పూరిని పవిత్రను కలిశానని అయితే వారితో మాట్లాడిన అతి తక్కువ సమయంలోనే ఆకాశ్ తనకు మంచి ఫ్రెండ్ అయ్యాడని ఈయన తెలిపారు.
ఆకాష్ పూరి తో మాట్లాడుతున్నంత సేపు ఆయన పూరి జగన్నాథ్ కుమారుడనే గర్వం తనలో ఏమాత్రం కనిపించలేదని, అతనితో మాట్లాడిన కొంత సమయానికి తన నుంచి ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నానని సోహైల్ తెలిపారు.ఆకాశ్ రూపంలో తనకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడని తనని ఇంత పద్ధతిగా పెంచిన పూరి జగన్నాథ్ పెంపకం గురించి కూడా ఈ సందర్భంగా సోహైల్ ప్రేశంసలు కురిపించారు.ఇలా ఆకాష్ పూరి గురించి సోహైల్ చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.