గెలిచాక బిగ్ బాస్ పై ఈ కామెంట్స్ ఏంటీ వీజే సన్నీ.. మరీ అంత కోపం ఎందుకో?

బిగ్ బాస్ షో.

ఈ షోని ఇష్టపడి చూసేవారు ఎంతమంది ఉన్నారో ఆ షో పేరు వింటేనే కోపంతో రగిలిపోతూ ఆ షోపై విమర్శలు గుప్పించే వారు అంతే మంది ఉన్నారు.అయితే బిగ్ బాస్ షో వల్ల ఎవరికి ఎటువంటి లాభం లేదని, అంతేకాకుండా బిగ్ బాస్ షో యువతని తప్పుదారి పట్టిస్తోందని విమర్శలను గుర్తిస్తూనే ఉంటారు.ఒక బిగ్ బాస్ షో అంటే పడని వారి ఎక్కువగా ఉన్నారు అని చెప్పవచ్చు.

ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఈ బిగ్ బాస్ షో గురించి బయట వ్యక్తులు విమర్శలు చేయగా తాజాగా ఏకంగా బిగ్ బాస్ షో విన్నరే ఈ షోపై విమర్శలు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.ఇటీవల తెలుగులో బిగ్ బాస్ సీజన్ 6 షో గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే.

ఇక మొదలై కనీసం రెండు రోజులు కూడా కాకముందే అప్పుడే కంటెస్టెంట్ల మధ్య గొడవలు మొదలయ్యాయి.కాగా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి 20 మంది కాంటెస్టెంట్ లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ షో పై కొందరు సామాజిక వేత్తలు స్పందిస్తూ విమర్శించడంతో కానీ గత సీజన్‌ విన్నర్‌ వీజే సన్నీ కూడా ఈ బిగ్ బాస్ రియాలిటీ షోపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.ఈ షో వల్ల ఎటువంటి ప్రయోజనం లేదంటూ ఆయన వ్యాఖ్యానించడం షాక్ ఇస్తోంది.

బిగ్ బాస్‌ సీజన్‌ 5 లో పాల్గొని టైటిల్‌ గెలుచుకున్న సన్నీ ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుని దూసుకెళ్తున్నారు.బిగ్ బాస్ షో తోనే బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు సన్నీ.కాగా ప్రస్తుతం సన్నీ చేతిలో మూడు సినిమాలు అలాగే ఒక వెబ్‌ సిరీస్‌ కూడా ఉంది.

ఈ అవకాశాలు అన్ని కూడా సన్నీకీ బిగ్‌ బాస్‌ 5 పూర్తయిన తర్వాతే రావడం విశేషం.కానీ ఈ షో వల్ల ఉపయోగం లేదని, చాలా మంది ఈ షో గురించి కూడా తెలియదని, బిగ్‌ బాస్‌లో విన్నర్‌ అంటూ ఎవరూ పట్టించుకోవడం లేదని, విన్నర్ అంటే అయితే ఏంటి అన్న విధంగా కామెంట్లు చేస్తున్నారని చెప్పారు వీజే సన్నీ.

ఓస్టార్‌ డైరెక్టర్‌ కూడా తనని ఈ విధంగా అడిగాడని, అందుకే తాను బిగ్‌ బాస్‌ విన్నర్‌ అని చెప్పుకోవడం మానేసి, సీరియల్‌ నటుడిని అని చెప్పి సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు సన్నీ.

'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

తాజా వార్తలు