ప్రస్తుతం బిగ్ బాస్( Bigg Boss Show ) లో టాప్ కంటెస్టెంట్ గా దూసుకుపోతున్న వాళ్లలో శివాజీ ఒకరు.ఈయన అప్పట్లో మంచి సినిమాలు చేసి హీరోగా తనకంటూ మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు అలాగే ఆయన చేసిన సినిమాలు చాలా వరకు మంచి విజయాలను అందుకున్నాయి.
ఈయన మొదట్లో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి ఆ తర్వాత హీరో గా మారి వరస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా నిలదొక్కుకున్నాడు.

ఇక అందులో భాగంగానే శివాజీ( Shivaji ) ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో చిరంజీవి,వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో కూడా నటించాడు ఇక పవన్ కళ్యాణ్ తో పాటు గా ఖుషి, జల్సా సినిమాల్లో నటించి తనలోని నటుడిని తెలుగు పరిశ్రమకి చాలా గొప్పగా పరిచయం చేశాడు.అయితే ఇప్పుడు ఆయన బిగ్ బాస్ షోలో చాలా బాగా ఆడుతూ ఆయనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకొని బిగ్ బాస్ కంటెస్టెంట్ లో అందరికంటే తనే బాగా గేమ్ ఆడుతూ ముందుకు వెళ్తున్నాడు.

కొందరు టీం మెంబర్స్ ఆయన మీద కక్షతో ఉన్నప్పటికీ ఆయన ఆడుతున్న గేమ్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇక అలాగే ఎవరిని కించపరచకుండ,అందరికీ సమానమైన రెస్ పెక్ట్ ఇస్తూ హౌస్ మేట్స్( Bigg Boss Housemates ) తో చాలా కలివిడిగా ఉంటున్నాడు.ఇక ఇప్పటికే ఈయనకి బిగ్ బాస్ ద్వారా చాలామంది అభిమానులు ఏర్పడ్డారు అందుకే ఈయన కూడా ఇక మీదట నుంచి గేమ్ ని చాలా సీరియస్ గా ఆడుతూ బిగ్ బాస్ టైటిల్ గెలవడం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ షో లో పార్టిసిపేట్ చేసిన చాలామంది ఎవరో కూడా జనాలకి తెలియదు.
ఒకసారీ ఈ షో లోకి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు చాలా పాపులారిటీ నీ సంపాదించుకున్నారు…పాపులారిటీ ఉన్నవాళ్లు ఇన్నిరోజులు ఈ గేమ్ షో లోకి వచ్చేవారు కానీ ఇప్పుడు ఈ గేమ్ షో లోకి వచ్చి పాపులారిటీ ని సంపాదించుకొని బయటికి పోతున్నారు…
.