బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..

బిగ్‌బాస్ హౌజ్( Bigg Boss 8 ) సిట్యుయేషన్ వైల్డ్ కార్డు ఎంట్రీ తర్వాత మరింత దారుణంగా మారింది.

ఇదొక ఎర్రగడ్డ హాస్పిటల్ అంటూ ఇంతకుముందు ప్రేక్షకులు తీవ్ర విమర్శలు చేశారు.

వైల్డ్ కార్డు ఎంట్రీ తర్వాత హౌస్‌లో మెంటల్ కేసులు మరింత పెరిగిపోయారని, వైజాగ్ పిచ్చి హాస్పిటల్ నుంచి కొందరిని పట్టుకొచ్చి హౌస్‌లో పడేసినట్లుగా పరిస్థితి తయారయ్యిందని బిగ్‌బాస్ ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు.ఈసారి సీజన్‌లో ముందుగా తీసుకొచ్చిన 14 మంది కంటెస్టెంట్లలో ఏ ఒక్కరు కూడా గేమ్ ను రక్తికట్టించలేకపోతున్నారు.

అందుకే బిగ్ బాస్ మునుపటి సీజన్ల కంటెస్టెంట్లను మళ్ళీ తీసుకొచ్చి హౌజు మొత్తం నింపేశాడు.వీళ్లు సరిగా ఆట ఆడడానికి బదులుగా చిరాకు పుట్టిస్తున్నారు.

టేస్టీ తేజ ( Tasty Teja )హౌస్ లోకి వచ్చిన తర్వాత అందులో ఉన్న కంటెస్టెంట్లతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.ఇటీవల "ఇదిగో నయని పావని( Nayani Pavani ), నిన్ను బయట అందరూ బండబూతులు తిడుతున్నారు" అని అన్నాడు.

Advertisement
Bigg Boss Is Now Fully Mentol Hospital , Tasty Teja , Nayani Pavani , Mukku

అంతే, ఆమె హౌస్ అంతా దద్దరిలేలాగా ఏడ్చేసి చిరాకు పుట్టించింది.ప్రేక్షకులను ఈ ఎపిసోడ్ బాగా ఇరిటేట్ చేసింది.

టేస్టీ తేజ కూడా అనవసరంగా ఆమెకి ఈ మాట చెప్పానంటూ డిసప్పాయింట్ అయ్యాడు.

Bigg Boss Is Now Fully Mentol Hospital , Tasty Teja , Nayani Pavani , Mukku

నవ్వకుండా ఉండండి పేరిట పెట్టిన ఓ గేమ్‌లో అవినాష్ కామెడీ పంచులతో అందరినీ నవ్వించి ఓడించడానికి ట్రై చేశాడు.గౌతమ్ కృష్ణను అశ్వత్థామ 2.0 అని అతను అనడంతో గౌతమ్ నన్ను ఇరిటేట్ చేయకండి అంటూ రచ్చ రచ్చ చేశాడు.అతడిని కూల్ చేద్దాం అనుకునే లోపే మైక్ తీసి నేలకేసి విసిరి కొట్టాడు, "బిగ్‌బాస్ నేను ఈ గేమ్ ఆడను" అంటూ పిచ్చి పట్టినట్లు ప్రవర్తించాడు.

నిజానికి అవినాష్ ఇక్కడ అతడిని ఏమీ అనలేదు కానీ గౌతమ్ బ్యాలెన్స్ కోల్పోయి పిచ్చిపిచ్చిగా అరిచేశాడు.అతనిపై బిగ్ బాస్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం.బిగ్‌బాస్‌ను తిట్టాడని, అతని ఆజ్ఞను ధిక్కరించాడని అభయ్ నవీన్‌ను ఎలిమినేట్ చేశారు.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025

గౌతమ్ విషయంలో మాత్రం ఎలాంటి చర్య తీసుకోకపోవడమే చాలా వింతగా ఉందని ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు.

Advertisement

గౌతమ్ చీఫ్ చదవాల్సిన అన్ని లెటర్లను ఆత్రుతగా తీసుకొని చదివేస్తుంటాడు.అతను ఒక మెంటల్ కేసు అని ఇప్పటికే ఆడియన్స్ ఒక ముద్ర వేశారు.ప్రస్తుతం హౌస్ లో ఉన్న అవినాష్, రోహిణి మాత్రమే వినోదాన్ని పంచే ప్రయత్నం చేస్తున్నారు.

హరితేజ ఇంతకు ముందులాగా యాక్టివ్‌గా కనిపించడం లేదు.ఇక గంగవ్వను బిగ్‌బాస్ ఎందుకు తీసుకొచ్చాడు అతనికే తెలియాలి ఆమె రావటం వల్ల ఆడియన్స్ మరింత చిరాకు పడుతున్నారు.

హోటల్ టాస్క్ ఇటీవల పెట్టగా అది ఏమాత్రం ఎంటర్టైన్ చేయలేకపోయింది.నెగెటివ్ టాక్ మూటగట్టుకుంటున్న యష్మి మాత్రమే ఈ టాస్క్ లో బెటర్‌గా పర్‌ఫామ్ చేసింది… పృథ్తి తనకి ఏ పాత్ర ఇచ్చారో కూడా తెలియకుండా ఈ గేమ్ ఆడాడు.

మిగతావాళ్లు కూడా చెత్తగా గేమ్ ఆడి మరింత డిసప్పాయింట్ చేశారు.

తాజా వార్తలు