Bigg Boss Oviya : నేను లెస్బియన్ కాదు అలాంటి ఫీలింగ్స్ నాకు లేవు.. బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్ వైరల్?

బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాల్టీ షోలలో బిగ్ బాస్ షో( Bigg Boss Show ) కూడా ఒకటి.

ఈ బిగ్ బాస్ షో తెలుగు తో పాటు హిందీ తమిళం మలయాళం భాషల్లో కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తూ సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇక బిగ్ బాస్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకోవడంతో పాటు వెండితెరపై అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.అలా బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో నటి ఓవియా కూడా ఒకరు.

మలయాళ నటి అయిన ఓవియా( Actress Oviya ) తమిళ బిగ్ బాస్ మొదటి సీజన్‌తో అలరించింది.ఓవియాకు దక్కిన పాపులారిటీ తమిళంలో మరే బిగ్‌బాస్ స్టార్‌కి లేదు ఎటువంటి సందేహం లేదు.

అంతేకాకుండా అప్పట్లో ఓవియా కోసం చాలా ఆర్మీ గ్రూపులు ఏర్పడ్డాయి.ఆ ఇమేజ్‌ ద్వారా తమిళ, మలయాళంలో అమెకు పలు సినిమా అవకాశాలు కూడా దక్కాయి.ఇప్పటి వరకు సుమారు 25 సినిమాలకు పైగా నటించిన ఈ బ్యూటీ తెలుగులో మాత్రం ఇది నా లవ్ స్టోరీ( Idhi Naa Love Story ).అనే మూవీలో మాత్రమే నటించింది.ఒక రకంగా చెప్పాలి అంటే తమిళ బిగ్‌బాస్‌ చరిత్రలో ఓవియా ఒక సంచలనమే అని చెప్పవచ్చు.

Advertisement

ఆ షోలో ఆమె ఆత్మహత్యకు పాల్పడటం పెద్ద దుమారమే రేగింది.ఇలా బిగ్‌బాస్‌ చరిత్రలో జరగడం ఇదే తొలిసారి.దాంతో ఓవియా తమిళంలో సంచలనంగా మారింది.

ఆ అలజడి కొద్దిరోజుల్లోనే ముగిసినా ఆమెకు ఎన్నో గొప్ప అవకాశాలు వచ్చాయి.

ప్రస్తుతం ఆమె చూయిగం( Chewing Gum Web Series ) అనే వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంది.ఈ సీరిస్‌ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓవియా వివాహం గురించి పలు వ్యాఖ్యలు చేసింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

నేను లెస్బియన్‌ని కాదు.నాకు అలాంటి ఫీలింగ్స్‌ ఏమీ లేవు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?

అంతేకాకుండా ఇప్పుడు పెళ్లి( Marriage ) గురించి నేను ఆలోచించడం లేదు.ఇప్పుడే కాదు, నా జీవితంలో ఇలాంటివి జరుగుతాయో లేదో కూడా తెలియదు.

Advertisement

జీవితంలో పెళ్లి అనేది తప్పనిసరి అని నేనెప్పుడూ భావించలేదు.అందరూ అనుకుంటున్నట్లు నేను ఏ బిడ్డకు జన్మనివ్వలేదు.

నేను ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను.పెళ్లయ్యాక బిడ్డను కనాలనే ఆలోచన కూడా నాకు లేదు.

పెళ్లయ్యాక ఒత్తిడిలో ఉండి జీవితాన్ని నాశనం చేసుకునే వారు చాలా మంది ఉన్నారు.నేను అలా ఉండాలనుకోను.

నేను నా కోసమే జీవిస్తున్నాను అని ఓవియా చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు