చౌదరి అనే తోక అవసరమా అని నన్ను అవమానించారు.. నేహా చౌదరి వైరల్ కామెంట్స్!

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా రాణిస్తున్న నేహా చౌదరి గురించి మనందరికీ తెలిసిందే.ఈమె స్పోర్ట్స్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Bigg Boss Fame Neha Chaudhary Said That I Was Insulted In The Name Of Caste, Big-TeluguStop.com

అంతేకాకుండా తెలుగులో ఉన్న ఏకైక స్పోర్ట్స్ యాంకర్ కూడా నేహా చౌదరినే.అయితే నేహా మొదట్లో చిన్నచిన్న టీవీ చానల్స్ లో పనిచేసి అలా అంచలంచెలుగా ఎదుగుతూ ఆ తర్వాత స్టార్ స్పోర్ట్స్ యాంకర్ గా ఎదిగింది.

అయితే బిగ్ బాస్ హౌస్ లో ఆమె ఆటతీరు,మాటతీరు ప్రేక్షకులకు నచ్చడం లేదు.ఇది ఇలా ఉంటే తాజాగా హౌస్ లో తన రియల్ లైఫ్ లో జరిగిన ఒక ఏదో అనుభవం గురించి చెప్పుకొని ఎమోషనల్ అయింది నేహా చౌదరి.

కాగా నేహ చౌదరి అప్పట్లో ఒక ఛానల్లో వర్క్ చేయడానికి వెళ్ళగా, అక్కడ మేకప్ అవుతూ ఆమె బ్యాగ్ తీసి పక్కన సీటు ఖాళీ ఉండటంతో అక్కడ పెట్టిందట.ఇంతలోనే అక్కడికి ఒక మేల్ యాంకర్ వచ్చి ఆమె పక్క సీట్లో ఉన్న బ్యాగ్ ని విసిరి కొట్టాడట.

ఎవడు ఇక్కడ బ్యాగ్ పెట్టింది.నేను వస్తుంటే లేచి నిలబడాలని తెలియదా? రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదా? నువ్వు చౌదరి అయితే ఏంటి? ఎవరైతే ఏంటి? ఇక్కడ చౌదరి లు గివ్దరీలు నడవవ్.ఏమనుకుంటున్నారు? అని గట్టిగా అరిచేశాడట.అంతేకాకుండా కులం ఫీలింగ్ ఉంది కాబట్టే నువ్వు పేరు వెనుక చౌదరి అని తగిలించుకున్నావు అని అరిచాడట.

Telugu Insulte, Neha Chowdhary-Movie

ఒకవేళ నీకు కులం ఫీలింగ్ లేకపోతే నీ పేరు వెనుక ఆ తోక ఎందుకు తగిలించుకున్నావు.నీ పొగరు బలుపు చూపించుకోవడానికి కదా.అంటూ సదరు మేల్ యాంకర్ నేహా చౌదరి పై విరుచుకుపట్టాడట.అప్పుడు నేహా గట్టిగా ఏడ్చేసి తిరగబడి ఏదైనా మాట్లాడదాం అంటే అతను చాలా సీనియర్ కావడంతో ఏమీ అనలేక సైలెంట్ గా ఉండిపోయింది.

అప్పుడు నేహా చౌదరి అక్కడ నుంచి బయటకు వచ్చేసి జరిగింది మొత్తం తన తల్లికి ఫోన్ చేసి వివరించి గట్టిగా ఏడ్చిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube