టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా రూపొందనున్న విషయం మనందరికీ తెలిసిందే.రాజమౌళి బాహుబలి సినిమా తర్వాతనే మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి.
కానీ ఆ తరువాత ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల మళ్ళీ వాయిదా పడాల్సి వచ్చింది.ఇక ఎట్టకేలకు వీరిద్దరి కాంబినేషన్ లో గ్లోబ్ ట్రోటర్ అనే కథాంశంతో సినిమా తెరకెక్కనుంది.
గ్లోబ్ ట్రోటర్ అనగా ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహస వీరుడు అని అర్థం.
అయితే ప్రస్తుతం మహేష్ బాబు,త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమా పూర్తి అవ్వగానే మహేష్ బాబు, రాజమౌళి సినిమా పట్టాలెక్కనుంది.దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా విషయమై ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నారు.
అయితే ఇది ఇలా ఉంటే తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రానున్న సినిమాకు సంబంధించి ఒక వార్త తెగ చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే మహేష్ బాబు సినిమా కోసం దర్శకుడు రాజమౌళి ఏకంగా ఒక హాలీవుడ్ నటుడిని తీసుకురావాలని పెద్ద ప్లానింగ్ చూపించినట్టు తెలుస్తోంది.

ఆ హాలీవుడ్ నటుడు మరెవరో కాదు నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్.థోర్ సినిమాతో క్రిస్ హెమ్స్‌వర్త్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.దీంతో మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.ప్రేక్షకులు కూడా బాహుబలి, ఆర్ఆర్ఆర్, మించి ఈ సినిమా ఉండబోతున్నట్లు అంచనా వేస్తున్నారు.
వీరిద్దరి కాంబినేషన్లో రానున్న సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతోంది అని తెలుస్తోంది.