బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ లో ప్రేక్షకులకు అంతోఇంతో పరిచయం ఉన్న కంటెస్టెంట్లలో నోయల్ ఒకరు.ఈగ, కుమారి 21 ఎఫ్ సినిమాలు నోయల్ కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
నోయల్ నటుడు మాత్రమే కాకుండా సింగర్ కూడా కావడంతో మ్యూజిక్ ప్రియులు సైతం బిగ్ బాస్ షో విన్నర్ కావాలని కోరుకుంటున్నారు.అయితే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో నెటిజన్లు నోయల్ ను ట్రోల్ చేస్తున్నారు.
నోయల్ తన తండ్రి ఇస్త్రీ పని చేసేవారని చెప్పగా వికీపీడియాలో మాత్రం రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగి అని ఉంది.దీంతో నోయల్ ప్రేక్షకుల్లో సానుభూతి పొంది ఓట్లు పొందాలనుకుంటున్నాడని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.
దీంతో నోయల్ తమ్ముడు జోయల్ ఈ వివాదం గురించి స్పందించి స్పష్టతనిచ్చారు.తన అన్న చెప్పిన మాటల్లో ఎటువంటి అబద్ధం లేదని కొందరు వికీపీడియాను ఎడిట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జోయల్ అన్నారు.
మొదట్లో తమ తండ్రి అన్న చెప్పినట్టుగానే ఇస్త్రీ పని, మేస్త్రీ పని చేసేవాడని, ఆటో కూడా నడిపాడని తన తండ్రికి డీఆర్డీవోలో ఉద్యోగం చేయడం కూడా నిజమేనని చెప్పారు.అందరూ డీఆర్డీవో అంటే అక్కడ పెద్దపెద్ద ఉద్యోగాల్లో నాన్న పని చేశాడని అనుకుంటున్నారని.
అక్కడ నాన్న సెక్యూరిటీ గార్డుగా పని చేశాడని జోయల్ వివరణ ఇచ్చారు.నోయల్ లైఫ్ స్ట్రగుల్స్ గురించి చెప్పే సమయంలో తండ్రి జాబ్ ట్రయల్స్ సమయంలో ఇస్త్రీ పని, మేస్త్రీ పని చేసినట్టు చెప్పాడని పేర్కొన్నారు.
అన్నయ్య కోసం పీఆర్ టీం పని చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని అయితే ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు.సోషల్ మీడియా పనులన్నీ తనే చూసుకుంటున్నానని.
కొందరు స్నేహితులు తనకు సహాయం చేస్తున్నారని జోయల్ వెల్లడించారు.