RC16 లో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ 7 కంటెస్టెంట్… ప్రకటించిన బుచ్చిబాబు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan ) ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ ( Game Changer ) సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన 16వ సినిమా అని ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ( Bucchi Babu ) దర్శకత్వంలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది.

ఉప్పెన సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి డైరెక్టర్ బుచ్చిబాబు తదుపరి ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు.అయితే రామ్ చరణ్ ఈయనకు తదుపరి సినిమా అవకాశం కల్పించారు.

ఉప్పెన( Uppena ) సినిమాకు గాను ఈయనకు నేషనల్ అవార్డు రావడంతో చరణ్ తో చేయబోయే సినిమాలో ఏఆర్ రెహమాన్ వంటి వారందరూ కూడా భాగం అవుతున్నారు.ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్జున్ అంబటి ( Arjun Ambati ) నటించే అవకాశం అందుకున్నారని స్వయంగా బిగ్ బాస్( Bigg Boss ) వేదిక పైన డైరెక్టర్ బుచ్చిబాబు తెలియజేయడంతో అర్జున్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

దీపావళి పండుగను పురస్కరించుకొని కొంతమంది సెలబ్రిటీలను నాగార్జున ( Nagarjuna )వేదికపైకి ఆహ్వానించిన సంగతి మనకు తెలిసింది.ఇందులో భాగంగానే డైరెక్టర్ బుచ్చిబాబు కూడా బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు.ఇలా బిగ్ బాస్ ఉన్నటువంటి అర్జున్ తో బుచ్చిబాబు మాట్లాడుతూ రామ్ చరణ్ తో చేయబోయే సినిమాలో మీరు కూడా ఒక పాత్రలో నటిస్తున్నారు అంటూ ప్రకటించడంతో అర్జున్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ థాంక్యూ బుచ్చన్న అంటూ తన సంతోషాన్ని బయటపెట్టారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో నటిస్తూనే మరోవైపు ఈయన రామ్ చరణ్ సినిమాలో అవకాశం అందుకోవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు