బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రస్తుతం 9 వ వారం ప్రసారం అవుతుంది.ఈ కార్యక్రమంలో భాగంగా గౌతమ్ కృష్ణ( Gautham Krishn a) కెప్టెన్ కావడంతో ఈ వీక్ మొత్తం అమ్మాయిలకు సెలవు ప్రకటించి ఇంటి పనులన్నీ అబ్బాయిలు చేయాలి అంటూ సరికొత్త నిర్ణయాలు తీసుకున్నారు.
ఇక నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో కెప్టెన్సీ కంటెండర్ టాస్కులను ప్రారంభించారు.ఇందులో భాగంగా బిగ్ బాస్ పలు టాస్కులను నిర్వహించారు.
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా అమర్ ( Amar Deep ) శివాజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నలు వేయగా అమర్ ప్రశ్నలకు శివాజీ దగ్గర సమాధానం లేకుండా పోయిన సంగతి మనకు తెలిసిందే.
ఇక శివాజీ( Shivaji ) హౌస్ లోకి వెళ్లినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా తనకంటూ ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ సీరియల్ బ్యాచ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా అమర్ ను టార్గెట్ చేస్తూ వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇదిలా ఉండగా తాజాగా మరోసారి శివాజీ అమర్ పై నోరు పారేసుకున్నారు.
గత ఎపిసోడ్లో భాగంగా ఎంతో బద్ధకంగా ఉన్నటువంటి తేజ శవాసనం వేసుకొని నేలకే అతుక్కుపోవడంతో బిగ్ బాస్ తనకు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలని సూచించగా కెప్టెన్ గౌతమ్ కృష్ణ చీర కట్టుకుని అమ్మాయిలా సిద్ధం కావాలని పనిష్మెంట్ ఇస్తారు.
ఇక కెప్టెన్ తేజకు అలాంటి పనిష్మెంట్ ఇవ్వడంతో శోభ వెంటనే తేజకు చీర కట్టించి ఎంతో అందంగా ముస్తాబు చేస్తుంది.ఇలా చీర కట్టుకున్నటువంటి తేజ అందరి దగ్గరకు వెళ్లి అబ్బాయిలను కౌగిలించుకుంటూ సందడి చేశారు .శివ శ్రీ మాత్రం అమర్ పట్ల తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. అమర్ వేస్ట్ గాడు అంటూ ఐటెం రాజా అంటూ తన పట్ల నోటికి వచ్చినట్లు మాట్లాడారు.ఈ విధంగా శివాజీ మాట్లాడటంతో అమర్ మాట్లాడుతూ ప్రతి సీజన్లోనూ అందరూ కలిసి ఒకరిని హీరో చేస్తారు కానీ ఈ సీజన్లో మాత్రం అందరూ కలిసి నన్ను విలన్ చేశారు అంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటారు.
అయితే అమర్ గురించి శివాజీ అలా మాట్లాడటంతో పలువురు శివాజీ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.