ఉత్కంఠగా 'టికెట్ టు ఫినాలే' రేస్.. అమర్ ఆశలకు గండికొడుతున్న రైతు బిడ్డ!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ( Bigg Boss Telugu Season 7 ) సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది.మరో మూడు వారాలు మాత్రమే ఈ షో రన్ కాబోతుంది.

 Bigg Boss 7 Telugu Pallavi Prashanth Own The Ball Task, Bigg Boss 7 Telugu, Prin-TeluguStop.com

ఇప్పటికే 12 వారాలు ముగించుకుని 13వ వారం కొనసాగుతుంది.ఈ వారంలో హౌస్ లో పోటీ రసవత్తరంగా జరుగుతుంది.

ఈ వారం అమర్ దీప్ మినహా హౌస్ లో ఉన్న మిగిలిన 7 మంది నామినేషన్స్ లో ఉన్నారు.ఇక టికెట్ టు ఫినాలే రేసు స్టార్ట్ అవ్వడంతో మరింత రసవత్తరంగా పోటీ స్టార్ట్ అయ్యింది.

ఇందులో భాగంగానే బిగ్ బాస్ కఠినమైన టాస్కులు ఇస్తున్నాడు.ఇక ఈ టాస్కుల్లో హౌస్ మేట్స్ అంత పాల్గొనగా ముందుగా అందరికంటే తక్కువ పాయింట్స్ తో శివాజీ, శోభా, ప్రియాంక రేసు నుండి తప్పుకున్నారు.

Telugu Amardeep, Bigg Boss, Biggboss, Nagarjuna, Prince Yawar, Shivaji-Movie

ఆ తర్వాత టికెట్ టు ఫినాలే రేస్ నుండి యావర్ తప్పుకుంటూ తన పాయింట్స్ పల్లవి ప్రశాంత్ ( Pallavi prashanth )కు ఇచ్చేసాడు.దీంతో అమర్ మొదటి స్థానంలో స్కోర్ బోర్డు లో నిలువగా పల్లవి ప్రశాంత్ రెండవ స్థానానికి చేరుకున్నాడు.కాగా ఈ రేసులో తాజాగా ”పట్టుకో తెలుసుకో” అనే టాక్ ఇచ్చాడు.ఈ రేసులో గౌతమ్,ప్రశాంత్, అర్జున్, అమర్ పాల్గొన్నారు.

Telugu Amardeep, Bigg Boss, Biggboss, Nagarjuna, Prince Yawar, Shivaji-Movie

ఈ టాస్క్ లో అమర్, ప్రశాంత్ బాగా యాక్టివ్ గా సమాధానాలు చెప్పారు.టికెట్ టు ఫినాలే రేసులో అమర్, ప్రశాంత్, గౌతమ్, అర్జున్ లకు మరో కఠినమైన టాస్క్ ఇచ్చాడు.చేతితో బంతిని తలకంటే పైన ఉంచి కాళ్ళు చేతులు సపోర్ట్ లేకుండా బాక్స్ మీద కూర్చోవాలి.ఈ టాస్క్ లో అమర్, గౌతమ్, అర్జున్ ఒక్కొక్కరిగా ఓడిపోగా ప్రశాంత్ ఎక్కువ సమయం బ్యాలెన్స్ చేసి విన్ అయ్యాడు.

దీంతో అమర్ దీప్ కు సమానంగా పల్లవి ప్రశాంత్ పాయింట్స్ పట్టికలో ఉన్నాడు.టికెట్ టు ఫినాలే రేసులో అయినా అమర్ దీప్ డైరెక్ట్ టాప్ 5 కు వెళ్లిపోవాలని ఆశలు పెట్టుకున్నాడు.

కానీ ఈ ఆశలకు కూడా పల్లవి ప్రశాంత్ గండి కొట్టి అతడే డైరెక్ట్ ఫినాలేకు వెళ్లిపోయేలా ఉన్నాడు.చూడాలి ఏం జరుగుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube