బిగ్ బాస్ 7 లో 5 వ వారం నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్ళే.!

ఈ సీజన్ బిగ్ బాస్ రియాలిటీ షో( Bigg Boss ) ఊహించని ట్విస్టులతో ముందుకు సాగిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

ప్రతీ ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునే విధంగా ఈసారి డిజైన్ చేసారు బిగ్ బాస్ సభ్యులు.

అందుకు తగ్గట్టు గానే కంటెస్టెంట్స్ కూడా పూర్తి స్థాయి పట్టుదలతో బిగ్ బాస్ టాస్కులను ఆడుతున్నారు.గత వారం నామినేషన్స్ లో నిలబడిన వారిలో ఒకరైన రతికా,( Rathika ) అతి తక్కువ ఓట్లతో బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

మొదటి వారం లో ఈమె ఆట తీరుని చూసి కచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉంటుందని అందరూ అనుకున్నారు.కానీ హౌస్ లో ఉన్నప్పుడు టాస్కులు ఆడకుండా మనుషులతో ఆదుకోవడం వల్ల, ఎవ్వరూ ఊహించని రీతిలో నాల్గవ వారం లోనే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.

ఇది ఆమెకి పెద్ద షాక్ అనే చెప్పాలి.

Advertisement

ఇక గత వారం లో గౌతమ్ ని( Gautam ) టాస్కులో భాగంగా బెల్ట్ తీసుకొని మెడ మీద నాన్ స్టాప్ గా కొట్టడం వల్ల తేజాకి( Tasty Teja ) నాగార్జున వేసిన శిక్ష డైరెక్ట్ నామినేషన్. అంటే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి మొట్టమొదట నామినేట్ అయిన కంటెస్టెంట్ గా తేజా నిలిచాడు.ఆ తర్వాత హౌస్ మేట్ నుండి పవర్ అస్త్ర ని కోల్పోయి కంటెస్టెంట్ గా మారిన శివాజీ( Sivaji ) కూడా ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చాడు.

అయన తో పాటుగా అమర్ దీప్, గౌతమ్, ప్రియాంక, శుభ శ్రీ మరియు యావర్ కూడా నామినేషన్స్ లోకి వచ్చారు.వీరిలో ఎవరు పవర్ అస్త్ర ని గెలుచుకుంటారో, వాళ్ళు నామినేషన్స్ నుండి బయటపడి ఇమ్యూనిటీ సంపాదించుకుంటారు.

ప్రస్తుతం హౌస్ మేట్స్ గా సందీప్,శోభా శెట్టి మరియు పల్లవి ప్రశాంత్ నిలిచారు.

పవర్ అస్త్ర ని కోల్పోయిన శివాజీ మళ్ళీ కసిగా ఆడి తన పవర్ అస్త్ర ని దక్కించుకుంటాడా?, లేదా కంటెస్టెంట్ గానే కొద్దీ రోజులు కొనసాగుతాడా అనేది చూడాలి.అందరికంటే ఈ పవర్ అస్త్ర ని గెలుచుకునే అవసరం తేజా కి ఉంది.ఎందుకంటే నామినేషన్స్ లో ప్రస్తుతం అందరికంటే అతి తక్కువ ఓట్లు ఆయనకే నమోదు అయ్యాయి.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

పవర్ అస్త్ర ని గెలుచుకుంటే అతను నామినేషన్స్ నుండి తప్పించుకొని బయటపడే ఛాన్స్ ఉంది.టాస్కులు ఆడడం లో బాగా వీక్ గా ఉండే తేజా పవర్ అస్త్ర ని గెలుచుకుంటాడో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు