Bigg Boss 6 Telugu: వీకెండ్స్ లో కూడా బోర్ కొట్టేస్తున్న బిగ్ బాస్ షో.. ఈ రేటింగ్ తో నెక్స్ట్ సీజన్స్ రావడం కష్టమే!

ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారమవుతున్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే గత సీజన్లతో పోల్చుకుంటే బిగ్ బాస్ సీజన్ 6లో ఎంటర్టైన్మెంట్ మరింత ఉంటుంది అని ప్రేక్షకులు భావించారు.

 Bigg Boss 6 Telugu Show Is Boring Even On Weekends Details, Bigg Boss Season 6,-TeluguStop.com

కానీ బిగ్ బాస్ సీజన్ 6 కి వచ్చినంత పరామ చెత్త రేటింగ్స్ మరే ఇతర సీజన్ కి రాలేదు అని చెప్పవచ్చు.హౌస్ లో పని లేదు ఎంటర్టైన్మెంట్ లేదు.

నార్మల్ డేస్ లో మాత్రమే కాకుండా నాగార్జున వచ్చే వీకెండ్స్ లో కూడా బోర్ కొట్టేస్తుంది బిగ్ బాస్ షో.వీకెండ్ ఎపిసోడ్స్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం టాస్కుల విషయంలో బిగ్ బాస్ యాజమాన్యం నానా తంటాలు పడుతున్నారు.

కొత్త కొత్త టాస్కులను తీసుకొచ్చినప్పటికీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు.నామినేషన్స్ అలాగే ఎలిమినేషన్ కూడా చప్పగా సాగుతున్నాయి.ఎలిమినేట్ అయినా కంటెస్టెంట్స్ బిగ్ బాస్ పై ఏదైనా కామెంట్స్ చేస్తారంటే అది కూడా లేదు.బిగ్ బాస్ హౌస్ లో కేవలం రేవంత్ ఆట, శ్రీ సత్య అందాలు, ఇనయా మెరుపులు, శ్రీహన్ స్ట్రాటజీ, అది రెడ్డి రివ్యూస్ కీర్తి ఏడుపు తప్పితే హౌస్ లో ఏమి కనబడడం లేదు.

అంతేకాకుండా హౌస్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ఎలిమెంట్స్ ఏమీ కనబడటం లేదు.బిగ్ బాస్ హౌస్ లో గీతూ రాయల్ ఉన్నప్పుడు కాస్తో కూస్తో ఫన్ ఉండేది.

ఇక ఆమె నోటి దురుసు వల్ల ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోవడంతో బిగ్ బాస్ హౌస్ లో అసలు ఫన్ అనేది లేకుండా పోయింది.

Telugu Adi Reddy, Weekends, Inaya, Nagarjuna, Revanth, Sri Satya, Srihaan, Tasks

ఆ తర్వాత శ్రీహాన్ ఇనయ ల మధ్య గొడవలు ఉండగా అవి కూడా లేకుండా పోయాయి.బిగ్ బాస్ సీజన్ 6 అంటేనే బోర్ కొట్టేస్తుంది అంటున్నారు ప్రేక్షకులు.అలాగే బిగ్ బాస్ రేటింగ్స్ ని బట్టి చూస్తే మరొక సీజన్ ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక బిగ్ బాస్ సీజన్ 6 అయితే మరి దారుణంగా ఉందని, ఇంత మాత్రానికే కంటెస్టెంట్లకు పారితోషికాలు తీసుకుని రావడం దండగ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే బిగ్ బాస్ షో ముగింపు దశకు చేరుకుంటున్నప్పటికీ హౌస్ లో ఆ హంగామా కనిపించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube