హిందీలో మొదలైన బిగ్ బాస్ రియలిరీ షో దెస వ్యాప్తంగా కూడా ఫుల్ ఫెమస్ అయ్యిందంటే అతిశయోక్తి కాదు.ప్రస్తుతం పలు భాషల్లో ప్రేక్షకులను అలరిస్తూ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది ఈ కార్యక్రమం.
బిగ్ బాస్ నుండి వచ్చిన వారు ఎంతోమంది సెలబ్రిటీస్ గా మారి తమకంటూ సోషల్ మీడియాలో ప్రత్యేకమైన క్రేజ్ ను అందిపుచ్చుకుంటున్నారు.అలానే పలువురు హీరో, హీరోయిన్లుగా కూడా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అలాంటి వారిలో హిందీ బిగ్ బాస్ లో మంచి పేరు సంపాదించినా షెహనాజ్ గిల్ కూడా ఒకరు.అయితే ఈమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
హిందీ బిగ్ బాస్ ద్వారా స్టార్ రేంజ్ కు వెళ్లారు షెహనాజ్ గిల్.ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా ఉండే షెహనాజ్ గిల్ బిగ్ బాస్ తర్వాత ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టి సన్నగా… నాజూగ్గా మారిన విషయం మనకు తెలిసిందే.
ఈ పంజాబీ ముద్దుగుమ్మ మొదట్లో ఆల్బమ్ సాంగ్స్ కు డాన్సర్ గా చేసేది.అదే విధంగా సింగర్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించింది.అయితే బిగ్ బాస్ పుణ్యమా అంటూ సోషల్ మీడియాలో క్రేజీ సెలబ్రిటీగా మారింది ఈ అమ్మడు.తాజాగా“మసాబా మసాబా” వెబ్ సిరీస్ సీజన్ 2 ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈ భామను ఒక అభిమాని తనని పెళ్లి చేసుకోవాలంటూ ప్రపోజ్ చేశాడు.

ఈ ప్రపోజల్ కు షెహనాజ్ ఫ్యాన్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.మీరు ప్రపోజల్ పెట్టారు సరే… మీ బయోడేటా కూడా నాకు పంపండి.నాతో జీవించడం చాలా కష్టం 24 గంటలు నేను మాట్లాడుతూనే ఉంటాను నేను చెప్పేది మీరు వినాలి, నా గురించి మాట్లాడుతూ ఉండాలి… ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా నాతో ఎక్కువ కాలం ఉండలేరు.అంటూ సమాధానం ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.







