సోషల్ మీడియాలో( Social Media ) నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని ఫన్నీగా వుంటే మరికొన్ని చాలా విచిత్రంగా అనిపిస్తాయి.
కొన్ని ఆశ్చర్యంగా అనిపిస్తే మరికొన్ని చాలా భయానకంగా అనిపిస్తాయి.తాజాగా అటువంటి రకానికి చెందిన వీడియో ఒకటి ఇక్కడ వైరల్ ( Viral ) కావడం మనం చూడవచ్చు.
ఇకపోతే పెద్ద పెద్ద కాళ్ళు, భారీ చేతులు, భారీ ఆకారంతో అచ్చం మనిషిని తలపించే గొరిల్లా( Gorilla ) మాదిరి జీవులను మనం పురాణ సినిమాల్లో సాధారణంగా చూశాం.కానీ ఇప్పుడు ఇలాంటి ఆకారంలో గల భారీ జీవి అడవుల్లో తిరుగుతోంది.
అవును, అది ఆహారం కోసం అన్వేషిస్తోంది.అడవుల్లో మనిషిని పోలిన భారీ బిగ్ ఫుట్ తిరగడం ఇపుడు సర్వత్రా కలకలం రేపుతోంది.

దానికి ఇక్కడ వీడియో ఫుటేజ్ లో మీరు చూడవచ్చు.అడవుల్లో తిరుగుతూ ఆహారం కోసం అన్వేషిస్తోంది ఈ బిగ్ ఫుట్.ఇక ఈ విషయం తెలిసిన వారు గ్రామాల్లోకి చొరబడి ఏం చేస్తుందో అని భయంతో వణికిపోతున్నారు.విషయం ఏమిటంటే, అమెరికాలో( America ) షానన్ పార్కర్, స్టెట్ సన్ అనే ఓ జంట రైలులో ప్రయాణిస్తోంది.
ఈ జంట కొలరాడో అడవుల్లో ప్రయాణిస్తుండగా.వీరికి ఓ వింత జీవి కనిపించింది.ఈ జీవి అచ్చం బిగ్ ఫుట్ మృగం లాగే ఉంది.దీంతో వెంటనే వారు ఈ వింతజీవిని వీడియో తీసి షేర్ చేశారు.

దాంతో ఈ వీడియోలో ఒక రహస్యమైన, భారీ ఆకారం, పొడవైన జీవి అడవుల్లో సంచరిస్తోంది అనే విషయం బయటకు తెలిసింది.బిగ్‌ఫుట్( Bigfoot ) అనే పెద్ద మానవరూప జీవిని తలపించడంతో ఆ జంట మొదట షాక్ కు గురైంది.ఆ తరువాత ఈ విషయం ఎలాగన్నా జనాలకి తెలియాలనే నెపంతో వారు సదరు వీడియోని తమ సోషల్ మీడియా వేదికల ద్వారా షేర్ చేశారు.అయితే ఆ జంతువు ఇది అని ఇంతవరకు ఎవరు కూడా క్లారిటీగా చెప్పలేని పరిస్థితి.







