బిగ్‌బాస్ సీజన్ 3లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి ప్రస్తుతం ఎలిమినేషన్‌లో ఉన్న విషయం తెల్సిందే.ఆమె ఖచ్చితంగా ఆదివారం నాడు ఎలిమినేషన్ అవ్వడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.
అయితే మొన్నటి ఎపిసోడ్‌లో రవికృష్ణతో ఆమె ప్రవర్తించిన తీరుతో తమన్నా సింహాద్రి అనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ రెడ్ కార్డ్ ఎలిమినేషన్ పొందబోతుంది అంటూ టాక్ వచ్చింది.అంటే ఆదివారం వరకు కూడా ఆమె ఇంట్లో ఉండే అవకాశం లేదు అంటూ గట్టిగా వాదన వినిపించింది.

తమన్నా ఓవర్ యాక్షన్, ఆమె ప్రవర్తన ఇంటి సభ్యులతో పాటు ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా ఇబ్బందిని కలిగించింది.దాంతో ఆమెను బయటకు పంపించడం ఖాయం అనుకున్నారు.తమన్నాను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూంకు పిలిచి చాలా గట్టి వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.వార్నింగ్ ఇచ్చింది అయితే చూపించలేదు.కాని ఖచ్చితంగా బిగ్‌బాస్ అయితే తమన్నాను పిలిచాడు అంటూ చెబుతున్నారు.రవికృష్ణను కన్ఫెషన్ రూంకు పిలిపించిన విషయం తెల్సిందే.
ఆ తర్వాత తమన్నాను కూడా పిలిచారట.

తమన్నాను బిగ్‌బాస్ పిలిచి సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు రెడ్ కార్డ్ ఎలిమినేషన్ అంటూ హెచ్చరించడంతో ఆమె నిన్నటి ఎపిసోడ్‌లో చాలా కూల్‌గానే కనిపించింది.అలీ విషయంలో కాస్త సీరియస్ అయినా కూడా మిగతా సమయంలో ఓకే పర్వాలేదు అనిపించింది.హిమజ విషయంలో స్టాండ్ తీసుకుని అలీని ఆమె ప్రశ్నించింది.
ఆ విషయంలో ఆమెకు మంచి మార్కులే పడ్డాయని చెప్పుకోవచ్చు.మొత్తానికి తమన్నా సింహాద్రీ నోరు కుట్టేయడంతో బిగ్‌బాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.







