కర్నాటక ఎన్నికల ముందు జేడీఎస్( JDS ) పార్టీకి సంబంధించిన చర్చే ఎక్కువగా జరిగింది.ఎందుకంటే కర్నాటక ఎన్నికల్లో టాఫ్ ఫైట్ ఉంటుందని, హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్, ఎన్నికల ముందు తేల్చి చెప్పాయి.
దాంతో అందరి ధృష్టి జేడీఎస్ పార్టీపై పడింది.ఎందుకంటే గత ఎన్నికల్లో మాదిరి హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్ పాత్ర జేడీఎస్ పార్టీ పోషించే అవకాశం ఉండడంతో ఆ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది ? అసలు ఆ పార్టీ ఎలాంటి ప్రణాళికలు రచించబోతుంది అనే చర్చ అందరిలోనూ జరిగింది.జేడీఎస్ అగ్రనేతలు కూడా హంగ్ ఏర్పడుతుదనే భావించారు.అందుకే తాము మద్దతు తెలిపే పార్టీ ఏది అనే దానిపై ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నామని చెబుతూ వచ్చారు.

కట్ చేస్తే గత ఎన్నికల్లో కంటే ఈసారి మరింత దిగజారింది జేడీఎస్ పార్టీ.గత ఎన్నికల్లో 37 సీట్లు రాగా.ఈసారి 21 సీట్లకే పరిమితం అయింది.మరోవైపు 136 సీట్లు సొంతం చేసుకొని ఇతర పార్టీ అండ లేకుండానే అధికారం చేపట్టబోతుంది హస్తం పార్టీ.దాంతో తమొకటి తాలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అన్నట్లు తయారైంది జెడిఎస్ పార్టీ పరిస్థితి.హంగ్ కచ్చితంగా ఏర్పడుతుందని మరోసారి తాము అధికారం చేపట్టవచ్చని బావించి కాంగ్రెస్, బిజెపి తో టచ్ లో ఉంటూ బిఆర్‌ఎస్( BRS party ) కు కూడా దూరం చేసుకుంది జేడీఎస్ అధిష్టానం.

తీర ఇప్పుడు జెడిఎస్ అండ లేకుండానే కాంగ్రెస్ సత్తా చాటడంతో జేడీఎస్ ను కాంగ్రెస్ పట్టించుకునే అవకాశం లేదు.ఇక ఈ ఎన్నికల కోసం కేసిఆర్ ను దూరంగా ఉంచిన జేడీఎస్ అధిష్టానం మళ్ళీ కేసిఆర్ తో కలిసే ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి.ఒకవేళ కేసిఆర్ తో కలవడానికి ప్రయత్నించిన ఈసారి ఆయన జేడీఎస్ ను నమ్ముతారా ? అనే సందేహమే.మొత్తానికి గత ఎన్నికల మాదిరి కింగ్ మేకర్ కావాలని కలలు కన్నా జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి ఆశలు బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయనే చెప్పాక తప్పదు.
అటు బిజెపి బిజెపి పరిస్థితి కూడా దాదాపు ఇదే విధంగానే ఉంది రెండవసారి అధికారం చేపట్టాలని ఉవ్విళ్ళూరిన కాషాయ పార్టీకి కన్నడిగులు 64 స్థానాలకే పరిమితం చేసి బిజెపికి కోలుకోలేని షాక్ ఇచ్చారు.మరి జేడీఎస్, బిజెపి పార్టీలు నెక్స్ట్ ఏం చేయబోతున్నాయనేది చూడాలి.







