తెలంగాణ కాంగ్రెస్ పై మంత్రి కేటీఆర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.కర్ణాటక నుంచి తెలంగాణ ఎన్నికలకు డబ్బులు తరలిస్తున్నారని ఆరోపించారు.
బెంగళూరు మాజీ కార్పొరేటర్ ఇంటిలో రూ.42 కోట్లు ఐటీకి పట్టుబడ్డాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.ఈ క్రమంలోనే డబ్బులను కొడంగల్ కు తరలించే పనిలో పట్టుబడ్డారని పేర్కొన్నారు.ఇప్పటికే కొడంగల్ కు రూ.8 కోట్లు చేరాయన్న మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ లో ముగ్గురు నేతల మధ్య సీఎం సీటుకు ఒప్పందం కుదిరిందని విమర్శలు చేశారు.ఒక్కొక్కరు ఏడాదిన్నర చొప్పున పదవీ కాలం పంచుకున్నారని పేర్కొన్నారు.
ఇప్పుడు టికెట్లు అమ్ముకుంటున్నారన్న కేటీఆర్ అధికారం వస్తే రేపు రాష్ట్రాన్ని అమ్మేస్తారని విమర్శించారు.రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు ఉండగా సుమారు 40 స్థానాల్లో కాంగ్రెస్ కు అభ్యర్థులే లేరని చెప్పారు.
పొన్నాల వంటి బీసీ నేతలను కాంగ్రెస్ అవమానిస్తోందని మండిపడ్డారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ లో చేరేందుకు పొన్నాలను ఆహ్వానిస్తామని కేటీఆర్ వెల్లడించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలకు పెద్ద పీట వేస్తామని స్పష్టం చేశారు.







