ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు సినిమాలు విడుదల కాగా ఈ మూడు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి.దసరా కానుకగా భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలు విడుదల కానుండగా ఈ సినిమాలు సైతం అదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అయితే ఈ మూడు సినిమాలలో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు భగవంత్ కేసరి ( Bhagavanth Kesari )కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు.

అటు బాలయ్య ఇటు అనిల్ రావిపూడి హీరోయిన్ శ్రీలీల( Sreeleela ) వరుస విజయాల తర్వాత నటించిన సినిమా కావడం ఈ సినిమాకు ఊహించని స్థాయిలో ప్లస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అటు మాస్ ప్రేక్షకులకు, ఇటు క్లాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉండనుందని అదే సమయంలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్న సినిమా కావడం వల్ల ఈ సినిమాకు మేలు జరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

యాక్షన్ సీన్స్, కామెడీ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్, ఊహించని ట్విస్ట్ లు, బాలయ్య మార్క్ యాక్షన్ ఈ సినిమాకు ప్లస్ కానున్నాయి.టైగర్ నాగేశ్వరరావు సీరియస్ మూవీ కావడంతో బీ, సీ సెంటర్ ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageswara Rao )సినిమాపై అంచనాలు పెరిగినా భగవంత్ కేసరితో పోల్చి చూస్తే మరీ భారీ రేంజ్ లో అయితే అంచనాలు పెరగలేదు.
లియో సినిమా లోకేశ్ కనగరాజ్ యూనివర్స్ నుంచి వచ్చిన మూవీ కావడంతో యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ప్రాధాన్యత ఇవ్వనున్నారు.పండుగ సినిమా అనే పదానికి న్యాయం చేసిన సినిమా మాత్రం భగవంత్ కేసరి అని కామెంట్లు వినిపిస్తున్నాయి.







