బీరువా నుంచి పెద్ద పెద్ద శ‌బ్దాలు.. ఏంటా అని చూస్తే..

కొన్ని వీడియోలు అంతే చూస్తుంటేనే కండ్లు చెమ‌ర్చుతాయి.మ‌రి కొన్ని మాత్రం భ‌యక‌ల్పితంగా ఉంటాయి.

 Big Noises From Beeruva If You Look At Anything , Beeruva, Snake-TeluguStop.com

ఇక ఇప్పుడు కూడా ఇలాంటి వీడియో గురించే తెలుసుకోబోతున్నాం.కాగా ఈ విచిత్ర ఘ‌ట‌న జ‌రిగింది ప్రభుత్వ జూనియర్ కాలేజీలో.

ఇప్పుడు స్కూల్లు తెరుచుకోవ‌డంతో రోజూలాగే కాలేజీ సిబ్బంది ఎవ‌రి పనుల్లో వారు ఉన్నారు.ఇక రోజువారీ ప‌నుల్లో భాగంగానే ప్రిన్సిపల్ చెప్పిన రికార్డున‌లు తీసుకొచ్చేందుకు ఫ్యూన్ బీరువా ద‌గ్గ‌ర‌కు వెల్లాడు.

కానీ ఇంత‌లోనే అక్క‌డ నుంచి ఏవో శ‌బ్దాలు వ‌స్తున్నాయి.కానీ ఆయ‌న ప‌ట్టించుకోకుండా ముందుకు వెల్లాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జ‌రిగిన ఘ‌ట‌న ఇప్పుడు స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.అయితే ఈ కాలేజీలో ప‌నిచేసే ఫ్యూన్ రికార్డుల కోసం ఆ బీరువాను ఓపెన్ చేయ‌గానే అక్క‌డ కనిపించిన దాన్ని చూసి భ‌య‌ప‌డిపోయాడు.

ఆ బీరువాలోంచి బుసులు కొడుతున్న త్రాచుపాము కోపంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.ఇంకేముంది అత‌ను అక్కడ నుంచి భ‌యంతో పరుగులు తీశాడనే చెప్పాలి.అయితే ఇలా పాములు రావ‌డం కొత్తేమీ కాద‌ని కానీ ఇలా బీరువాలో దూర‌డ‌మే కొత్త అంటూ చెబుతున్నారు.

ఇక ప్యూన్ దాన్ని త్వ‌ర‌గానే క‌నిపెట్టి అక్క‌డి నుంచి క్ష‌ణంలో దూరంగా రావ‌డంతో అత‌నికి ప్ర‌మాదం త‌ప్పింది.

ఇక అక్క‌డే ఉన్న కాలేజీ సిబ్బంది కూడా అక్క‌డి నుంచి ప‌రుగులు తీశారు.ఆ త‌ర్వాత వారంతా కూడా స్నేక్ క్యాచర్‌కు స‌మాచారం అందించారు.ఇక స్నేక్ క్యాచ‌ర్ వ‌చ్చి పామును చాకచక్యంగా పట్టుకుని ద‌గ్గ‌రిలోని చెట్ల పొద‌ల్లో దాన్ని విడిచి పెట్టాడు.దీంతో కాలేజీ సిబ్బంది మొత్తం బ‌యం నుంచి తేరుకుని ఊపిరి పీల్చుకున్నారు.

కాగా ఇలా పాములు రాకుండా చేసేందుకు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కాలేజీ సిబ్బంది వివ‌రించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube