ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ ( Congress party )అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఆ పార్టీ తరుపున రాష్ట్రాన్ని పాలించే సిఎం పదవిపై కూడా స్పష్టత వచ్చింది.
కాంగ్రెస్ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన రేవంత్ రెడ్డికే సిఎం పదవి కట్టబెట్టింది అధిష్టానం.దాంతో తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాద్యతలు చేపట్టనున్నారు.
కాగా మొదటిసారి సిఎం పదవి చేపడుతున్న రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ముందు ఎన్నో సవాళ్ళు వెంటాడుతున్నాయి.ముఖ్యంగా ఆరు గ్యారెంటీల పేరుతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించిన కాంగ్రెస్ వాటి అమలుకు ఎలాంటి ప్రణాళికలు వేయనుంది ? రేవంత్ రెడ్డి వాటిని ఎలా అమలు చేయబోతున్నారనేది ఆసక్తి రేపుతున్న అంశాలు.

కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో ఆరు గ్యారెంటీ హామీలే ప్రధాన కారణం అని చెప్పవచ్చు.వాటిని కచ్చితంగా అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు ఎన్నోసార్లు స్పష్టం చేస్తూ వచ్చారు.అయితే ఈ హామీలను అమలు చేయడం అంతా తేలికైన పనికాదు.ఎందుకంటే ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి ప్రభుత్వం మీద అధనపు ఆర్థిక భారం పడనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో వాటి అమలు కోసం నిత్యవసర ధరలు, బస్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొనే అవకాశం ఉందనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.

ఇకపోతే ఈ ఆరు గ్యారెంటీ హామీలను ఒకేసారి అమలు చేస్తారా ? లేదా దశల వారీగా వీటి అమలు ఉంటుందా ? అనేది కూడా కొంత ఆసక్తిరేకెత్తిస్తున్న అంశమే.అయితే ప్రమాణస్వీకారం రోజునే ఆరు గ్యారెంటీ హామీలపై సంతకం చేస్తామని గతంలో రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పుకొచ్చారు.దీంతో చెప్పినట్లుగానే వీటిపై తొలి సంతకం ఉండబోతుందా అనేది చూడాలి.ఇక గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందిస్తామని చెబుతున్నా రేవంత్ రెడ్డి ముందు చాలానే సవాళ్ళు ఉన్నాయి.
మరి వాటన్నిటిని అధిగమించి రేవంత్ రెడ్డి తనదైన రీతిలో ఎలా పాలన సాగిస్తారో చూడాలి.