బైడెన్ VS ట్రంప్ : న్యూయార్క్ టైమ్స్ సర్వేలో ఎవరిది పైచేయి అంటే..?

అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అమెరికాలో రాజకీయాలు వేడెక్కాయి.ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్,( President Joe Biden ) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు( Donald Trump ) 2024 అధ్యక్ష బరిలో నిలిచారు.

 Biden Shrinks Trumps Edge In Latest New York Times And Siena College Poll-TeluguStop.com

అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై ప్రతినిత్యం రకరకాల సర్వేలు , ఓపీనియన్ పోల్స్ వెలుగులోకి వస్తున్నాయి.తాజాగా ‘‘ ది న్యూయార్క్ టైమ్స్ ,( The New York Times ) సియానా కాలేజ్ ’’( Siena College ) చేసిన కొత్త సర్వేలో బైడెన్, ట్రంప్‌లు ముందస్తు పోలింగ్ నెంబర్స్‌ను దాదాపుగా పట్టుకున్నారని చెబుతోంది.

ట్రంప్ ఇప్పటికీ 46 , 45 శాతం రేటింగ్‌తో వున్నారు.బైడెన్‌పై స్వల్పంగా ఆధిక్యంలో వున్నప్పటికీ.

ఫిబ్రవరి చివరి నుంచి అధ్యక్షుడు కూడా బాగానే పుంజుకున్నారు.ఇద్దరు అభ్యర్ధుల మధ్య అంతరం విషయానికి వస్తే.

బైడెన్ ట్రంప్ కంటే 5 శాతం వెనుకబడి వున్నట్లుగా సర్వే చెబుతోంది.

Telugu Biden, Biden Trump, York Times, Joe Biden, Trump, Presidential-Telugu NRI

ఈ పోల్ ఫలితాలను చూస్తుంటే నెక్ టూ నెక్ పోటీ తప్పదని భావించవచ్చు.బైడెన్ వర్సెస్ ట్రంప్( Biden Vs Trump ) రేసుకు మించి.64 శాతం మంది ఓటర్లు అమెరికా తప్పుడు దిశలో పయనిస్తోందని నమ్ముతుండటం గమనార్హం.ట్రంప్, బైడెన్‌ల మధ్య పోలిక పెట్టేటప్పుడు వయసును కూడా కొందరు పరిగణనలోనికి తీసుకుంటున్నారు.సగానికిపైగా ఓటర్లు బైడెన్ పెద్దవాడు అంటూనే.నేరారోపణలతో సతమతమవుతున్న ట్రంప్ వైఖరిని సమానంగా వ్యతిరేకించారు.అధ్యక్షుడిగా జో బైడెన్ పనితీరును 38 శాతం మంది ఆమోదిస్తుండగా.

అతని వ్యూహాలను 59 శాతం మంది వ్యతిరేకిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదిక పేర్కొంది.

Telugu Biden, Biden Trump, York Times, Joe Biden, Trump, Presidential-Telugu NRI

ట్రంప్ విషయానికి వస్తే.జూన్‌లో ఆయనకు 78 ఏళ్లు నిండుతాయి.ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో( US Presidential Elections ) గెలిస్తే చరిత్రలో అత్యంత పెద్దవయస్కుడైన అమెరికా ప్రెసిడెంట్‌గా నిలుస్తాడు.

కనీస వయసు వ్యత్యాసం వున్నప్పటికీ .కొన్ని ఇతర అంశాలు ట్రంప్‌కు అనుకూలంగా వున్నాయి.69 శాతం మంది బైడెన్ మరోసారి అధ్యక్షుడిగా పనిచేయడానికి వయసును గుర్తుచేస్తుండగా.41 శాతం మంది మాత్రం ట్రంప్‌ను ఈ విషయంలో వ్యతిరేకిస్తున్నారు.64 శాతం మంది ట్రంప్ అధ్యక్షుడిగా వున్నప్పటి ఆర్ధిక వ్యూహాలను ప్రశంసించారు.బైడెన్ తన పదవీకాలంలో ఆర్ధిక వ్యవస్థను సరిగా నిర్వర్తించలేదని 63 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఆర్ధిక నిర్వహణలో ట్రంప్ ప్రశంసలు పొందినప్పటికీ.కోవిడ్‌ను ఎదుర్కోవడం , అమెరికాలో జాతిపరమైన సంబంధాలను ఏకీకృతం చేయడంలో బైడెన్ ముందున్నారు.ఆర్ధిక వ్యవస్థతో పాటు ఇమ్మిగ్రేషన్ , విదేశీ సంఘర్షణలు, శాంతి భద్రతల పరిరక్షణను ట్రంప్ బాగానే నిర్వర్తించారని ఓటర్లు అభిప్రాయపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube