బిచ్చగాడు 2 రివ్యూ: మూవీ ఎలా ఉందంటే?

2016 సంవత్సరంలో విడుదలైన బిచ్చగాడు సినిమా ఎంతలా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుందో చూసాం.తల్లి మీద ప్రేమ అనేది అద్భుతంగా చూపించి మంచి మార్కులు సంపాదించుకున్నాడు విజయ్ ఆంటోనీ.

 Bichagadu 2 Review: How Is The Movie Bichagadu 2, Review ,vijay Antony, Tollyw-TeluguStop.com

ఇక ఇంత కాలానికి సీక్వెన్స్ గా బిచ్చగాడు 2( Bichagadu 2 ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రియా కృష్ణస్వామి( Priya Krishnaswamy ) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కూడా విజయ్ ఆంటోనీ హీరోగా నటించాడు.

ఇక ఈ సినిమాను విజయ్ ఆంటోని సొంతంగా నిర్మించుకున్నాడు.ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన లుక్స్, ట్రైలర్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి.ఇక ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే ఇందులో విజయ్ ఆంటోని ద్విపాత్రభినయం చేశాడు.ఒకటి విజయ్ గురుమూర్తి పాత్ర అయితే మరొకటి సత్య అనే పాత్ర.అయితే విజయ్ గురుమూర్తి దేశంలోనే పెద్ద ధనవంతుడు.లక్ష కోట్ల వారసుడైన విజయ్ గురుమూర్తి పై అందరి కళ్ళు ఉంటాయి.ఇక సత్య బిచ్చం ఎత్తుకునే ఒక బిచ్చగాడు.

రోడ్ల పక్కన ఫుట్ పాత్ పక్కన ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ దొరికింది తిని బ్రతుకుతుంటాడు.అయితే విజయ్ గురుమూర్తి అనుకోకుండా చనిపోతాడు.

అదే సమయంలో సత్యను పోలీసులు అరెస్టు చేస్తారు.అయితే ఉన్నట్టుండి సత్య అచ్చం విజయ్ లాగా మాట్లాడుతాడు.

దీంతో దాని వెనకాల బ్రెయిన్ మార్పిడి ఉందని తెలుస్తుంది.దీంతో ఆ విషయం తెలుసుకున్న కొందరు సత్య న్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

అయితే సత్య కి ఫ్లాష్ బ్యాక్ లో తన చెల్లెలు తప్పిపోయి ఉంటుందని.తనకి వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకొని తన చెల్లెని కనిపెడుతాడా లేదా అనేది మిగిలిన కథలోనిది.

Telugu Bichagadu, Kavya Thapar, Kollywood, Review, Tollywood, Vijay Antony-Movie

నటినటుల నటన:

నటీనటుల నటన విషయానికి వస్తే విజయ్ ఆంటోనీ( Vijay Antony ) నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.క్లాస్ గా కనిపిస్తూనే మాస్ గా ఒకేసారి అదరగొట్టేస్తాడు.ఇక ఈ సినిమాలో కూడా ఒకటే ఎక్స్ప్రెషన్స్ తో కనిపించాడని చెప్పాలి.హీరోయిన్ కావ్య థాపర్(Kavya Thapar ) నటన పర్వాలేదు.మిగతా నటీనటులంతా తమ పాత్రకు తగ్గట్టుగా చేశారు.

Telugu Bichagadu, Kavya Thapar, Kollywood, Review, Tollywood, Vijay Antony-Movie

టెక్నికల్:

ఇక డైరెక్టర్ కథను అద్భుతంగా చూపించారని చెప్పాలి.కానీ కొన్ని కొన్ని సన్నివేశాలు చాలా సింపుల్ గా అనిపించాయి.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగా ఆకట్టుతుంది.

మిగిలిన నిర్మాణ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.

Telugu Bichagadu, Kavya Thapar, Kollywood, Review, Tollywood, Vijay Antony-Movie

విశ్లేషణ:

బిచ్చగాడు సినిమాకు ఈ సినిమాకు అసలు పొంతన లేదు అని చెప్పాలి.ఈ సినిమా స్టోరీ లైన్ మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది.ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యిందని చెప్పాలి.

ఇక బ్రెయిన్ టాన్స్ ప్లాంట్ సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకున్నాయి.ఇక సెకండ్ హాఫ్ కథ కాస్త బోరింగ్ అని ఫీలింగ్ అనిపించింది.

ప్లస్ పాయింట్స్:

నటీనటుల నటన, ఫస్ట్ హాఫ్, సంగీతం.

మైనస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్ బోరింగ్.కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించింది.

బాటమ్ లైన్: చివరగా చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమాపై బిచ్చగాడు 1 లాగా భారీ అంచనాలు పెట్టుకోకపోవటమే మంచిది.నిజానికి చెప్పాలంటే ఈ సినిమా రొటీన్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చింది.

రేటింగ్: 2/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube