బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయని పెద్దలు ఊరికే చెప్పరు.జరిగిన ఎన్నో సంఘటనలను ఆధారంగా తీసుకొనే చెప్తుంటారు.
రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన ఈ సామెత కి మరో ఉదాహరణ.మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమా, ఒక చిన్న హీరో చిత్రం కంటే తక్కువ వసూళ్లు రాబడుతుంది అంటే ఎవరైనా నమ్ముతారా.?, కానీ నమ్మాలి, ఎందుకంటే అది జరిగింది కాబట్టి.రీసెంట్ గానే శ్రీ విష్ణు( Sri Vishnu ) హీరో గా నటించిన ‘సామజవరగమనా’ చిత్రం విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన సంగతి అందరికీ తెలిసిందే.
ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ లో ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు వచ్చాయి.ఇక ఓవర్సీస్ లో అయితే కేవలం 25 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా ఏకంగా, 1 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది.

1 మిలియన్ డాలర్స్ అంటే 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ మరియు నాలుగు కోట్ల రూపాయలకు పైగా షేర్ అన్నమాట.ఈ కలెక్షన్స్ ని రీసెంట్ గా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రం దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది.అక్కడి ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు 5 లక్షల డాలర్లు మాత్రమే వచ్చాయి.ఇదే దాదాపుగా క్లోసింగ్ కలెక్షన్స్ అనుకోవచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు.
స్టార్ హీరోల సినిమాలు ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ కనీసం 1 మిలియన్ డాలర్ వసూళ్లను రాబట్టాలి.కానీ ‘భోళా శంకర్’( Bhola Shankar ) చిత్రం హాఫ్ మిలియన్ వసూళ్లకే పరిమితం అవ్వడం, అది కూడా రీసెంట్ గా విడుదలైన ‘సామజవరగమనా’ కంటే తక్కువ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
మరో విశేషం ఏమిటంటే ఈ రెండు సినిమాలకు నిర్మాత అనిల్ సుంకర అవ్వడం విశేషం.

ఓవర్సీస్ లో ‘సామజవరగమనా’ కంటే తక్కువ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఆంధ్ర ప్రదేశ్ / తెలంగాణ లో రీసెంట్ గా విడుదలై దుమ్ము లేపిన ‘బేబీ’ కంటే తక్కువ.కనీసం దరిదాపుల్లో కూడా వెళ్లలేకపోయింది అని చెప్పొచ్చు.బేబీ చిత్రం ఇప్పటి వరకు 45 కోట్ల రూపాయిల వసూళ్లను రాబడితే, ‘భోళా శంకర్’ చిత్రం కనీసం 30 కోట్ల రూపాయిల మార్కును అయినా అందుకుంటుందో లేదో అనే సందేహం లో పడేసింది.
ఇలాంటి డిజాస్టర్ మెగాస్టార్ చిరంజీవి పనిగట్టుకొని చెయ్యాలి అనుకున్నా కుదరదు ఏమో .క్రింద పడిన ప్రతీసారి రెట్టింపు ఉత్సాహం తో పైకి లేచే స్వభావం ఉన్న మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడు అందం లో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.
.






