'జం జం జజ్జనిక' అంటూ సెలెబ్రేషన్ స్టార్ట్ చేసిన చిరు.. భోళా సాంగ్ ఈ రోజే!

మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) ఫుల్ ఫామ్ లో ఉండడంతో అంతే జోష్ తో సినిమాలు చేస్తూ పోతున్నాడు.

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భోళా శంకర్ ( Bhola Shankar ).

తమిళ్ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.

కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

అనిల్ సుంకర( Anil Sunkara ) ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.దీంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

Advertisement

రిలీజ్ కు దగ్గర పడుతుండడంతో ఈ సినిమా నుండి వరుసగా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తూ అంచనాలు మరింత పెంచేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి భోళా మేనియా అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసారు.ఇది బాగా ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు రెండవ పాటకు సమయం ఆసన్నం అయ్యింది.

కొద్దీ సేపటి క్రితమే సెకండ్ సాంగ్ పై మేకర్స్ అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చారు.సెకండ్ సింగిల్ ఈ రోజు రాబోతుంది అని చెప్పడంతో మెగా ఫ్యాన్స్ మరోసారి ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

ఈ సాంగ్ ప్రోమో ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలుపుతూ చిరు మాస్ లుక్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసారు.జం జం జజ్జనిక ( Jam Jam Jajjanika )అంటూ సాగే ఈ సాంగ్ సెలెబ్రేషన్ సాంగ్ అని తెలిపారు.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

అందుకే ఈ సాంగ్ పై మరింత ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.మొత్తం సాంగ్ ను జులై 11న రిలీజ్ చేస్తామని పోస్టర్ ద్వారా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు