భీష్మ ప్రతిజ్ఞ: 21 ఏళ్ల తర్వాత గడ్డం తీయుంచుకున్న వైనం... ఎందుకో తెలుసా?

భీష్మ ప్రతిజ్ఞ అనే నానుడి గురించి వినే వుంటారు.ఇది మహాభారత కాలం నుండి వాడుకలో వుంది.

ఎవరన్నా అన్న మాటకు కట్టుబడి వుంటే ఈమాట చెబుతారు.మనలో కొంతమంది మాటలకు అస్సలు విలువ వుండదు కానీ, కొంతమందుంటారు.

వారు యెవరికన్నా మాట ఇస్తే, దాన్ని ఎట్టి పరిస్తితులలోను తప్పరు, తూచ పాటిస్తారు.ఇక్కడ అలాంటి మనిషి గురించే మాట్లాడుకుంటున్నాము.ఆమధ్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు.2013లో ఆయన శపథం చేయగా.ఎట్టకేలకు 2018లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది.

దీంతో 15 ఏళ్ల తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి సమక్షంలోనే ఆయన చెప్పులు ధరించారు.తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది.

Advertisement

ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి కూడా ఇలాగే ఒక శపథం చేశారు.తమకు ప్రత్యేక జిల్లా కావాలని.

మనేంద్రగఢ్, చిర్మిరి, భరత్ పూర్ ప్రాంతాలను జిల్లాగా ప్రకటించేంత వరకు తాను గెడ్డం చేసుకోనని అప్పుడెప్పుడో 21 ఏళ్ల క్రితం శపథం చేశారు.

అయితే తాజాగా ఈ 3 ప్రాంతాల కలయికలో 32వ జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.దీంతో శుక్రవారం ఆయన తన పొడవాటి గెడ్డం కత్తిరించుకున్నారు.ఈ శపథం చేసిన వ్యక్తి పేరు రాంశేఖర్ గుప్త.

మహేంద్రగఢ్ నివాసి, ఆర్ టీఐ కార్యకర్త.ఈయన చేసిన డిమాండ్ ప్రకారం.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
ఒలంపిక్ పతకాలలో నిజంగా బంగారం ఉంటుందా..? లేదా..?

గతేడాదిలోనే మనేంద్రగఢ్, చిర్మిరి, భరత్ పూర్ ప్రాంతాలను కలిపి జిల్లా ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.దీంతో ఆయన పోయిన ఏడాది ఆగస్టులో గెడ్డం చేసుకున్నారు.

Advertisement

అయితే జిల్లా ఏర్పాటు చర్యలు ప్రారంభం కాలేదు.దీంతో మరోసారి గెడ్డం శపథం చేశారు.

కాగా, తాజాగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించడంతో ఏడాది తర్వాత మరోసారి గెడ్డం చేసుకున్నారు.

తాజా వార్తలు