కారు ' పార్టీ అభ్యర్థి ప్రభాకరేనా ? కేసీఆర్ నిర్ణయం ఏంటంటే.. ?

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల టెన్షన్ ఎక్కువ అవుతోంది.  ప్రధానంగా బిజెపి,  కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి.

 Kcr Likely To Annonce Karne Prabhakar As Trs Munugode Candidate Details, Kcr, Te-TeluguStop.com

గతంతో పోలిస్తే తెలంగాణలో బిజెపి బాగా బలపడడం,  కేంద్ర మంత్రులు,  బిజెపి అగ్ర నేతలు వరుసగా తెలంగాణకు క్యూ కడుతూ టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ ఉండడం వంటి విషయాలను కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు.మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు బిజెపి , కాంగ్రెస్ పార్టీలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇప్పటికే బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు కాగా,  కాంగ్రెస్ తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును ప్రకటించారు.
  కానీ అధికార పార్టీ టిఆర్ఎస్ మాత్రం అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఇంకా సరైన క్లారిటీకి రాలేకపోతోంది.

మొదటి నుంచి మాజీ ఎమ్మెల్యే కర్నే ప్రభాకర్ పేరు టిఆర్ఎస్ నుంచి వినిపిస్తోంది.అయితే ఆయనతో పాటు మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కాంగ్రెస్, బిజెపిలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను ప్రకటించడంతో టీఆర్ఎస్ ముందుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పోటీకి దింపాలని భావించింది.దీనిపై అనేక సర్వేలు నిర్వహించింది.

Telugu Karneprabhakar, Telangana, Trs-Political

అయితే రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థిని పోటీకి దించితే ఫలితం అనుకూలంగా ఉంటుందనే రిపోర్టులు రావడంతో కెసిఆర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారట.నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది.అయినా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే టిఆర్ఎస్ అభ్యర్థిత్వం కట్టబెట్టాలని కేసిఆర్ నిర్ణయించారంట.దీంతో ప్రభాకర్ పేరు దాదాపు ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది.అయితే ఈ సీటు కోసం పోటీపడుతున్న బురా నరసయ్య గౌడ్ తో పాటు , మరికొంతమంది టిక్కెట్ ఆశిస్తున్న నేతలను ముందుగానే బుజ్జగించి ఆ తర్వాత అభ్యర్థిని ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

   

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube