పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ చిత్రంగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్.ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీ విడుదల అయ్యి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఇప్పటికే పలుచోట్ల ఈ సినిమాకు ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా కలెక్షన్లను రాబడుతోంది.ఇలా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస విజయాలను అందుకుంటూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నారు.
థియేటర్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.పవన్ కళ్యాణ్ ఇందులో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.
ఇక పవన్ కళ్యాణ్ కు పోటీగా రానా డానియల్ శేఖర్ పాత్ర కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి.ఈ విధంగా గత నెల 25వ తేదీ థియేటర్ లో విడుదలైన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది.
ఈ క్రమంలోనే థియేటర్లో ఈ సినిమాని చూడలేకపోయిన అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా సంయుక్తంగా కొనుగోలు చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమాని ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.ఈ సినిమా గత నెల 25వ తేదీ విడుదల కావడంతో థియేటర్లలో విడుదలైన 30 రోజులకు ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.







