యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో నితిన్ అదిరిపోయే హిట్ కొడతాడని అభిమానులు ముందు నుండే అంచనాలకు వచ్చారు.
అనుకున్నట్లుగానే ఈ సినిమాతో నితిన్ సూపర్ సక్సెస్‌ను కొట్టాడు.ఛలో వంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను అందించిన వెంకీ కుడుముల మరోసారి అదే జోనర్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు.
అందాల భామ రష్మిక మందన కూడా ఈ సినిమాలో నటిస్తుండటంతో భీష్మ చిత్రంపై ప్రేక్షకులు పూర్తి నమ్మకం పెట్టుకున్నారు.ఇక రిలీజ్ రోజునే ఈ సినిమాకు మంచి టాక్ రావడం, పోటీలో మరే సినిమా లేకపోవడంతో భీష్మ అన్ని చోట్ల అదిరిపోయే వసూళ్లను సాధించింది.తొలి వారం ముగిసే సరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.23.75 కోట్ల మేర వసూళ్లు సాధించింది.నితిన్ కెరీర్‌లో భీష్మ చిత్రం మరో బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా మొదటి వారం ముగిసే సరికి కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాలు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.నైజాం - 7.50 కోట్లు సీడెడ్ - 2.85 కోట్లు ఉత్తరాంధ్ర - 2.58 కోట్లు ఈస్ట్ - 1.43 కోట్లు వెస్ట్ - 1.19 కోట్లు గుంటూరు - 1.54 కోట్లు కృష్ణా - 1.33 కోట్లు నెల్లూరు - 0.59 కోట్లు టోటల్ ఏపీ+తెలంగాణ - 19.02 కోట్లు రెస్టాఫ్ ఇండియా - 1.75 కోట్లు రెస్టాఫ్ వరల్డ్ - 3 కోట్లు టోటల్ వరల్డ్‌వైడ్ - 23.75 కోట్లు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy