పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ టీజర్ క్రియేట్ చేసిన సెన్సేషన్‌ను బట్టి ఈ సినిమాపై ఏ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ అయ్యాయో చెప్పేయొచ్చు.
ఇక ఈ సినిమాను దర్శకుడు సాగర్ కె చంద్ర మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించినప్పుడు పలు అనుమానాలు నెలకొన్నా, ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ టీజర్‌తో అవన్నీ తుడుచుకుపోయాయి.
ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ ఎనర్జీతో మరో లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని ఈ సినిమా టీజర్ చూస్తే చెప్పొచ్చు.
ఈ సినిమాలో మరో యంగ్ హీరో రానా దగ్గుబాటి కూడా నటిస్తుండటంతో వారిద్దరు ఎదురపడే సీన్స్ ఎలా ఉంటాయా అనే ఆసక్తి అప్పుడే ప్రేక్షకుల్లో నెలకొంది.ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేసింది.
అయితే తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ సంక్రాంతికి ఉండబోదట.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు చేసిన కొన్ని సీన్స్‌ను మళ్లీ రీషూట్ చేస్తుందట చిత్ర యూనిట్.
ఈ లెక్కన ఈ సినిమా మిగతా షూటింగ్ ముగించుకునే సరికి చాలా సమయం పడుతుందని, అందుకే ఈ సినిమా రిలీజ్ విషయంలో తొందరపడొద్దని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యిందట.
అంతేగాక సంక్రాంతి బరిలో తీవ్ర పోటీ కూడా ఉండటం ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు మంచిది కాదని భావించి, భీమ్లా నాయక్ చిత్రాన్ని వాయిదా వేస్తున్నారట చిత్ర యూనిట్.
మరి సంక్రాంతి బరిలో కాకుండా భీమ్లా నాయక్ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారని పవన్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.అయితే ఈ సినిమాకు సంబంధించి వస్తున్న రిలీజ్ వాయిదా వార్తపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.
ఇక ఈ సినిమాలో నిత్యా మీనన్, ఐశ్వర్యా రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తు్న్నారు.