తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుంది అంటే ఇక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రెండవ సినిమా విడుదల అవుతున్న సినిమా భీమ్లా నాయక్.సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న సినిమా ఈనెల 25వ తేదీ విడుదల కావడంతో నేడు రిలీజ్ వేడుకను నిర్వహించ నున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు కోసం ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా పోలీసులు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు.ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరై అభిమానులకు కొన్ని సూచనలు కూడా చేశారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరై వారు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలని పోలీసులు వెల్లడించారు.
*ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెళ్లేవారు తప్పనిసరిగా ఎంట్రీ పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతి తెలుపుతారు.
*అయితే ఈ కార్యక్రమాన్ని ముందుగా ఫిబ్రవరి 21వ తేదీ నిర్వహించడంతో చాలామంది ఈ తేదీకి సంబంధించిన పాసులు తీసుకున్నారు.అయితే 21వ తేదీకి సంబంధించిన ఎంట్రీ పాస్ ఉన్నవారిని అనుమతించబడదు.
*ఎంట్రీ పాస్ లేని వారు పొరపాటున కూడా స్టేడియం వద్ద గూమికూడకుదని పోలీసులు హెచ్చరించారు.
*దూర ప్రాంతాల నుంచి ప్రీ రిలీజ్ వేడుకకు ఎంట్రీ పాస్ లు లేకుండా వచ్చి గొడవకు దిగితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
*ఇక ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారు నిర్దేశించిన స్థలంలోనే వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి.ఈ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.