ఆ విషయం తెలిసి రాజీవ్ కనకాల నా కాళ్లు పట్టుకోబోయాడు.. భీమ్లా నటుడి కామెంట్స్ వైరల్!

భీమ్లా నాయక్ సినిమా ద్వారా ఎంతోమంది నటులకు ఊహించని స్థాయిలో గుర్తింపు వచ్చిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న నటులలో ఎం.

 Bheemla Nayak Actor Ms Chowdary Comments About Rajeev Kanakala Goes Viral , Bhee-TeluguStop.com

ఎస్.చౌదరి కూడా ఒకరు.తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఎం.ఎస్.చౌదరి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.తాను ఆదిగురువు అమ్మ సినిమాకు దర్శకత్వం వహించానని ఎం.ఎస్.చౌదరి వెల్లడించారు.

తనకు పేమెంట్ ఎగ్గొట్టిన నిర్మాతలు ఉన్నారని ఎం.ఎస్.చౌదరి అన్నారు.తన పాత్ర కట్ అయిందని పేమెంట్ ఇవ్వని సందర్భాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

ఆరేడు సినిమాలకు పేమెంట్ ఎగ్గొట్టారని ఆయన అన్నారు.నా పర్సనాలిటీకి రెస్పెక్ట్ ఇస్తారని స్టార్టింగ్ లో మాత్రం చాలా ఇబ్బందులు పడ్డానని ఆయన తెలిపారు.

సన్నగా ఉన్న సమయంలో నా ముఖం కూడా ఎవరూ చూడలేదని ఆయన అన్నారు.

ప్రతి ఒక్కరూ సిక్స్ ప్యాక్ లో కనిపించడం ఎలా సాధ్యమవుతుందని ఎం.ఎస్.చౌదరి తెలిపారు.సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ పై శ్రద్ధ పెట్టే బదులు యాక్టింగ్ పై శ్రద్ధ పెడితే మంచిదని ఆయన అన్నారు.ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ చేస్తే కృష్ణుడి పాత్రకు సూట్ అవుతారా? అని ఎం.ఎస్.చౌదరి ప్రశ్నించారు.రాజీవ్ కనకాలకు నా గురించి తెలుసని ఆయన గురించి అందరికీ తెలుసని ఎం.ఎస్.చౌదరి తెలిపారు.

రాజీవ్ కనకాలను కొన్నిరోజుల క్రితం కలవగా మొదట గుర్తు పట్టలేదని తాను ఎం.ఎస్ చౌదరి అని చెప్పగా గుర్తుపట్టి కౌగిలించుకున్నారని ఎం.ఎస్.చౌదరి అన్నారు.తనతో చెయ్యడం నా అదృష్టం అని రాజీవ్ కనకాల అన్నారని ఎం.ఎస్ చౌదరి తెలిపారు.జబర్దస్త్ శాంతికుమార్ డైరెక్షన్ లో ఆ సినిమా తెరకెక్కిందని ఎం.ఎస్.చౌదరి తెలిపారు.రాజీవ్ కనకాల ఎన్ని నంది అవార్డులు వచ్చాయని అడగగా 17 వచ్చాయని చెప్పానని రాజీవ్ కనకాల తన కాళ్లకు నమస్కారం పెట్టే ప్రయత్నం చేశారని తాను ఆపానని రాజీవ్ కనకాల తనకు అవార్డులు రాలేదని చెప్పారని ఎం.ఎస్.చౌదరి వెల్లడించారు.

Bheemla Nayak Actor Ms Chowdary Comments About Rajeev Kanakala Goes Viral

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube