గ్రామాలే దేశానికి పట్టు కొమ్మలని తెలియజేసే చిత్రం భీమదేవరపల్లి ప్రారంభం !!!

ఇదొక తెలంగాణ ఆర్గానిక్ గ్రామీణ జీవన చిత్రం, భీమదేవరపల్లి గ్రామంలో జరిగే కొన్ని కథలు దేశంలోని ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబిస్తాయి.”గ్రామాలే దేశానికి పట్టుకోమ్మలు.” ఈ భీమదేవరపల్లేలోని సామాన్యుడి జీవిత ఆరాటం,పోరాటం ఈ కథల్లో సజీవమై ఉంటుంది.ఈ చిత్రంలోని ప్రతి పాత్ర కట్టు,బొట్టు,యాస ప్రేక్షకులని నేటివిటీకి దగ్గరగా తీసుకెళుతుంది.

 Bheemadevarapalli Movie Launch By Minister Talasani Srinivas Yadav , Bheemadevar-TeluguStop.com

క్లైమాక్స్ దేశవాళీని ఆలోచింపజేస్తుంది.భారతదేశంలోని ఒక ప్రాంతపు ఊరిలో జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి ఒక సెన్సేషనల్ అయ్యింది.

ఆ సంఘటనలోనే ప్రజల అమాయకత్వం, హాస్యం, జీవన విధానం, దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి.అందుకే ఆ సంఘటనను “Neorealism” Generలో మేకింగ్ చేస్తున్నాం.

నియోరియలిజం జానర్ లో వస్తున్న మొదటి తెలుగు చిత్రం ఇది.కథలోని రియాలిటీ పోకూడదని ఇమేజ్ లేని ఆర్గానిక్ నటీనటులనే ఎంపిక చేసుకుని నిర్మిస్తున్న కంటెంట్ ఓరియంటెడ్ ఆర్గానిక్ మూవీ.ఈ నెల 11th నుంచి 45 రోజులు సింగిల్ షెడ్యూల్లో నిర్మాణం పూర్తి చేసుకుంటుంది.చరణ్ అర్జున్ సంగీతం, సుద్దాల సాహిత్యం మట్టి పరిమళాన్ని తలపిస్తుంది.

అనేకమంది థియేటర్ ఆర్టిస్టులు, అంజి బాబు, ప్రసన్న, కీర్తి లత, అభి, కావేరీ, మురళి గౌడ్,పద్మ, మానుకోట ప్రసాద్,గడ్డం నవీన్, సుధాకర్ రెడ్డి, మల్లికార్జున్, మహి, వల్లి సత్య ప్రకాష్, మహేష్ వంటి అనేక మంది నటీనటులు నటిస్తున్నారు.

ఏబి సినిమాస్ & నిహల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి “మీ శ్రేయోభిలాషి”చిత్రంతో గుర్తింపు పొంది డాక్టరు రాజేంద్ర్రసాద్ గారితో “బేవర్స్” సినిమా దర్శకత్వం వహించిన రమేశ్ చెప్పాల ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం జరిగాయి.ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫర్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.అలాగే ఈ కార్యక్రమంలో రమేష్ ప్రసాద్ తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.

దేశంలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలు ఆధారంగా దర్శకుడు రమేష్ చెప్పాలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.తెలంగాణ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది, చిత్ర నిర్మాత కీర్తిలత గౌడ్ కు అలాగే ఈ భీమదేవరపల్లి చిత్రంలో నటిస్తున్న అందరూ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube