Yendira Ee Panchayithi: ఏందిరా ఈ పంచాయతీ సినిమా రివ్యూ అండ్ రేటింగ్!

ప్రతి శుక్రవారం ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటాయి.ఇకపోతే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సినిమాలలో ఏందిరా ఈ పంచాయతీ (Yendira Ee Panchayithi) సినిమా ఒకటి.

 Bharath Vishika Laxman Yendira Ee Panchayithi Movie Review And Rating-TeluguStop.com

భరత్,( Bharath ) విషికా లక్ష్మణ్‌( Vishika Laxman ) జంటగా ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మించిన చిత్రం ఏందిరా ఈ పంచాయితీ సినిమా ద్వారా గంగాధర్ దర్శకుడిగా పరిచయమయ్యారు.విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలుసుకుందాం.

కథ:

రామాపురం గ్రామంలో జరుగుతుంది.ఆ ఊర్లో ముగ్గురు స్నేహితులు ఉంటారు.అయితే వీరిలో అభి( Abhi ) అనే పాత్రలో నటించిన భరత్ ఎస్ఐ కావాలని కోరుకుంటారు.అయితే మిగతా ఇద్దరు స్నేహితులు ఎలాంటి పని పాట లేకుండా తిరుగుతూ చిల్లర దొంగతనాలు చేస్తుంటారు వారితో పాటు అభి కూడా అలాంటి దొంగతనాలు చేస్తూ ఉంటారు.ఆక్రమంలోనే ఊరి పెద్ద కూతురు యమున (విషికా)తో( Yamuna ) లవ్‌లో పడతాడు.

 ఆ తరువాత అభి జీవితంలోవచ్చిన మలుపులు ఏంటి? హీరోయిన్ తండ్రిని చంపబోయిన కేసులో అభి ఎందుకు అరెస్ట్ అవుతాడు? అదే సమయంలో ఊరిలో కూడా పెద్దవాళ్లు మరణించడం ఆ కేసులో పోలీసులు అభిని అరెస్టు చేయడం అరెస్టు నుంచి ఆయన ఎలా బయటపడ్డాడు ఆ హత్యలు ఎవరు చేశారు అన్నదే ఈ సినిమా కథ.

Telugu Bharath, Gangadhar, Ravi Varma, Love Story, Vishika Laxman, Yendiraee-Lat

నటీనటుల నటన:

అభి పాత్రలో భరత్ ఎంతో అద్భుతంగా నటించారు.నటనకు కొత్త అయినప్పటికీ ఈయన డాన్స్ యాక్షన్ సీన్స్ అలాగే ఎమోషనల్ సీన్స్ లో కూడా ఎంతో అద్భుతంగా నటిస్తూ అందరిని ఆకట్టుకున్నారు.విషిక అయితే అచ్చం పల్లెటూరు అమ్మాయి పాత్రలో ఎంతో ఒదిగిపోయిన నటించారు.

కాశీ విశ్వనాథ్( Kashi Vishwanath ) ఎమోషనల్ రోల్‌ను పోషించాడు.సుధాకర్‌గా రవి వర్మ ( Ravi Varma )ఆకట్టుకుంటాడు.

 ఇక హీరో స్నేహితుల పాత్రలో నటించిన వారు కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు.

Telugu Bharath, Gangadhar, Ravi Varma, Love Story, Vishika Laxman, Yendiraee-Lat

టెక్నికల్:

టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో అద్భుతంగా స్క్రీన్ ప్లే తీసుకువచ్చారు అయితే అక్కడక్కడ కొన్ని సీన్స్ స్లో అయ్యాయని చెప్పాలి.ఫోటోగ్రాఫర్ పనితీరు కూడా ఎంతో అద్భుతంగా ఉంది.నిర్మాణ విలువలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి ఇక సన్నివేశాలకు అనుగుణంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

విశ్లేషణ:

వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీలకు( Village Love Story ) మంచి ఆదరణ ఉంటుంది.అలాంటి జానర్లకు కాసింత సస్పెన్స్, కాసింత థ్రిల్లింగ్ గా చూపించే ప్రయత్నం చేశారు.

ఇలాంటి కథాంశంతో ఇదివరకే సినిమాలు వచ్చాయి కనుక ప్రేక్షకులకు కొత్తగా చూసామని అనుభూతి అయితే కలగలేదని చెప్పాలి.చివర్లో వచ్చే ట్విస్టులు సినిమాపై ఆసక్తి పెంచాయి.

Telugu Bharath, Gangadhar, Ravi Varma, Love Story, Vishika Laxman, Yendiraee-Lat

ప్లస్ పాయింట్స్:

నటీనటుల నటన, పాటలు, కొన్ని ఎమోషన్ సీన్స్.సెకండ్ హాఫ్ హైలెట్

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ బోర్ కొట్టే సన్నివేశాలు, రోటీన్ కథ, ఫస్ట్ అఫ్ ఆకట్టుకోలేకపోవడం

బాటమ్ లైన్:

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం ఈ సినిమా నుంచి రివ్యూ చేసే ట్విస్టులు కాస్త సినిమా పై ఆసక్తిని పెంచేలా చేశాయి మొత్తానికి ఈ సినిమాని ఒకటికి రెండుసార్లు చూడవచ్చు.

రేటింగ్:3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube