ప్రేమ పెళ్లి చేసుకొని మురికివాడలో భానుమతి కష్టాల కాపురం ..!!

ప్రేమ అనేది ఎప్పుడు, ఎలా, ఎవరి మీద పుడుతుందో అనే విషయం చెప్పడం చాలా కష్టం.

ఒకరికి తొలిచూపులోనే ప్రేమ పుడితే మరికొంత మందికి వ్యక్తిత్వం చూసి, అందం చూసి ప్రేమ పుడుతుంది.

ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మనం ఎదుటివారి మీద ద్వేషం, పగ పెంచుకున్నాగాని అది ఒక్కోసారి ఎదుటివారి మీద ప్రేమకు పునాదులు వేస్తుంది.కొంత మందికి ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే అని అనిపిస్తుంది.

ప్రేమ గురించిన అనుభూతులు మాటలకూ అందనివి, వర్ణనాతితం.ప్రేమకు ధనిక, పేద అనే భావన ఉండదు.

అంతస్తులు, ఆస్థి,హోదా అసలు పట్టించుకోవు.అలాంటి ఒక నిజమైన ప్రేమ కధ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే వెలుగు చూసింది.

Advertisement

ఆ అందమైన హీరోయిన్ ప్రేమ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.అప్పట్లో హీరోయిన్ భానుమతి అందానికి ఎంతో మంది ఫిదా అయ్యారు.

ఎన్నో లక్షల మంది ఆమె అందానికి, అభినయానికి పరితపించిపోతుంటే.ఆమె మాత్రం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను గాఢంగా ప్రేమించింది.

ఈమె ఇగో తో మొదలయిన ప్రేమ మకుటం లేని మహారాణిగా సినిమాల్లో వెలిగిపోతున్న రోజుల్లో ఆమెను ఒక మాములు వ్యక్తి, వ్యక్తిత్వం ఆమెను ప్రేమలో పడేలా చేసాయి .ఆ రోజుల్లోనే ఆమెను హీరోయిన్ గా చూస్తూ, ఆమెతో మాట్లాడడానికి ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటే ఆ అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రం కేవలం షూటింగ్ సమయంలో మాత్రమే మాట్లాడేవారు.పలు సందర్భాలలో భానుమతి ఆయనతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా ఆయన మాత్రం మాట్లాడేవారు కాదట.

ఇంతకు ఆయన ఎవరనేదేగా మీ సందేహం.ఆయన పేరే రామకృష్ణ.

ఇండియన్2 టికెట్స్ తమిళనాడులోనే చీపా.. టికెట్ రేట్లు పెంచి ఏం సాధిస్తారంటూ?
ఆ విషయంలో భయపడుతున్న ఎన్టీఆర్.. అలా చేస్తే రిస్క్ చేసినట్టే అని ఫీలవుతున్నారా?

ఎప్పుడు పని పని.అని ఆలోచించే వ్యక్తి.భానుమతి ఎంత ప్రయత్నించినా మాట్లాడక పోయేసరికి ఒకరోజు భానుమతి గారికి కోపం వచ్చింది.

Advertisement

దానితో గల్లీ గల్లీ తిరుగుతూ, నేరుగా ఆయన ఇంటికి వెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని ప్రశ్నించింది.నన్ను పెళ్లి చేసుకుంటేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను లేదంటే కదిలేది లేదు అని మొండి పట్టుదల పట్టింది.

ఆమె ప్రేమను గుర్తించిన రామకృష్ణ భానుమతి ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు.అంతేకాదు పెళ్లయిన తర్వాత సినిమాలు చేయడం మానేస్తాను అని రామకృష్ణ గారికి మాట కూడా ఇచ్చారు భానుమతి.

భానుమతి రామకృష్ణ ని పెళ్లి చేసుకోవటం భానుమతి వాళ్ళ ఇంట్లో ఇష్టం లేకపోయినా గానీ పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది.ఇద్దరు గుళ్లో పెళ్లి చేసుకుని అమ్మ నాన్న ఆశీర్వాదం కోసం భానుమతి వాళ్ళ ఇంటికి వెళ్ళింది.కానీ భానుమతి వాళ్ళ నాన్న వాళ్ళను దగ్గరకు రానివ్వలేదు.

అని భానుమతి తల్లి గారు ఆవిడ నగలు ఇస్తుంటే రామకృష్ణ గారు వద్దంటూ మాకు వద్దు మాకు ఉన్నది చాలు, ఉన్న దానితో సంతోషంగా బతుకుతాము అంటూ వచ్చేసారు.మురికివాడలో కొత్తకాపురం పెట్టి మొదట్లో చాలానే కష్టాలు అనుభవించారు.

ఆ సమయంలో నాగిరెడ్డి చక్రపాణి ఆమెను బలవంత పెట్టి స్వర్గ సీమ సినిమాలో నటించాలంటూ ఆమెను పట్టుపట్టారు.ఈ ఒక్క సినిమా చేయండి చాలు.తర్వాత మీ ఇష్టం అనడంతో భానుమతి ఆ సినిమాలో నటించారు.

స్వర్గసీమ’లోని ఆమె పాత్ర అమాయకురాలైన కూచిపూడి నాట్యగత్తె.రానురాను ఆధునికంగా తయారై, హీరోని వలలో వేసుకుని, తర్వాత ఇంకొకరిని వలలో పేసే పాత్ర.

ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో భానుమతికి మరిన్ని అవకాశాలు వచ్చాయి.అయితే పెళ్లి అయ్యాక ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవ్వడంతో తప్పనిసరి పరిస్థితులలో మళ్ళీ సినిమాల్లో నటించారు.

వీరి ఇద్దరికి గల ఏకైక సంతానం భరణి.ఈ భరణి పేరు మీదనే భరణీ స్టూడియో నిర్మించి, అనేక చిత్రాలను ఈ దంపతులు నిర్మించారు.

అలాగే భానుమతి గారు కేవలం నటిగానే మన అందరికి తెలిసి ఉండొచ్చు.కానీ ఈవిడ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలువురి మన్ననలు కూడా అందుకున్నది.

ఓ గాయనిగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో యజమానిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా పలు పాత్రలు సమర్ధవంతంగా నిర్వర్తించింది.అయితే ఇంతటి ప్రజ్ఞాశాలి అయిన భానుమతి రామకృష్ణ గారు 2005 డిసెంబర్ 24 న చెన్నై లోని తన స్వగృహంలో తనువు చాలించారు.

తాజా వార్తలు