కాలంలో సినిమాలు ఎన్నో విభిన్న కథాంశల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఇలా సరికొత్త కథతో భాను శ్రీ (Banu Sree) సోనాక్షి వర్మ (Sonakshi varma) వంటి తదితరులు నటించినటువంటి తాజా చిత్రం కలశం(Kalasham).
కొండా రాంబాబు దర్శకత్వంలో అనురాగ్ భాను శ్రీ సోనాక్షి వర్మ జీవ సమీర్ రవి వర్మ వంటి తదితరులు నటించినటువంటి ఈ సినిమా నేడు డిసెంబర్ 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రాజేశ్వరి చంద్ర వాడపల్లి నిర్మాణంలో తిరిగిన ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది అనే విషయాన్ని వస్తే…
కథ:
తన్వి (భాను శ్రీ) దర్శకురాలిగా ఒక హర్రర్ సినిమాని( Horror Movie ) తెరకెక్కించాలని అనుకుంటుంది.ఇలా సినిమాలంటే ఇష్టం ఉండడంతో ఒక మంచి కథను తయారు చేసుకుని నిర్మాతలను కలిసి సినిమా చేయటానికి ఒప్పిస్తుంది అయితే కథ మొత్తం విన్నటువంటి ఒక నిర్మాత క్లైమాక్స్ మార్చమని చెబుతాడు.దీంతో ఈమె తిరిగి వెనక్కి వస్తుంది ఆ సమయంలో తన్వి( Tanvi ) తన స్నేహితురాలు కలశ (సోనాక్షి వర్మ)( Kalasa ) దగ్గరకు వెళ్తే ఇంట్లో కలశ ఉండదు.
ఫోన్ చేస్తే కలిశాను ఒక పని మీద బయటకు వచ్చానని చెప్పడంతో తన్వి ఒక్కతే లోపలికి వెళ్తుంది.అయితే ఆ ఇల్లు అచ్చం తన్వి తన కథలో రాసుకున్న విధంగానే ఉంటుంది.

ఆ కథలోని కొన్ని సన్నివేశాలు ఆమె కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి.ఇకపోతే ఆమెకు తెలియకుండా ఆ ఇంట్లో మరొకరు ఉంటారు.కానీ తన్వి మాత్రం కలశ చెల్లెలు అన్షు (రోషిని కామిశెట్టి) తనని ఆట పట్టిస్తుందని భావిస్తూ ఉంటుంది.కట్ చేస్తే మరుసటి రోజు ఈమెకు ఆ ఇంటి పనిమనిషి షాకింగ్ విషయాలు చెబుతారు.
కలశ, అన్షు ఇద్దరు కూడా రెండు నెలల క్రితమే చనిపోయారని చెప్పడంతో తన్వి షాక్ అవుతుంది.అసలు వాళ్ళిద్దరూ ఎలా చనిపోయారు? ఈ సినిమా కథ నేపథ్యం ఏంటి సస్పెండ్ అయినటువంటి సిఐ కార్తికేయ (రవి వర్మ) ఎందుకు ఈ కేసును రహస్యంగా విచారించారనే విషయాలు తెలియాలి అంటే పూర్తి సినిమా చూడాల్సిందే.
నటినటుల నటన:
బిగ్ బాస్ ద్వారా ఎంతో గుర్తింపు పొందిన భాను శ్రీ ఈ సినిమాలు ఎంతో అద్భుతంగా నటించారు.యంగ్ డైరెక్టర్ తన్విగా ఆమె చక్కగా నటించింది.
తెరపై కావాల్సిన చోట అందాలను ఆరబోస్తూనే.తనదైన నటనతో ఆకట్టుకుంది.
సోనాక్షి వర్మ, రోషిణి కామిశెట్టి,( Roshini Kamishetty ) పోలీస్ అధికారిగా కార్తికేయ( Karthikeya ) ప్రతి ఒక్కరూ కూడా వారి పాత్రాలకు పూర్తి న్యాయం చేశారని చెప్పాలి.

టెక్నికల్:
డైరెక్టర్ కొండ రాంబాబు( Director Konda Rambabu ) ఈ సినిమాని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు కొన్ని సన్నివేశాలు భయంకరంగా ఆసక్తిని కలిగించేలా ఉన్నాయి.విజయ్ కురాకుల సంగీత నేపథ్యం అందరిని ఎంతగానో ఆకట్టుకునే కొన్నిచోట్ల భయంకరంగా బిజిఎం ఉందని చెప్పాలి ఎడిటింగ్ కూడా అద్భుతంగా చేశారు.ఫోటోగ్రఫీ కూడా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి ఇక నిర్మాణాత్మక విలువలు అద్భుతంగా ఉన్నాయి నిర్మాత ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు.
విశ్లేషణ:
సైకలాజికల్ థ్రిల్లర్, హారర్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది.దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ.
తెరపై దాన్ని ఆసక్తికరంగా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు.సినిమా మొదటి పాకం మొత్తం ఎక్కువగా కామెడీకే ప్రాధాన్యత చూపించారు.
ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు సెకండ్ హాఫ్ పై పెద్ద ఎత్తున అంచనాలను పెంచేసాయి.మీ అక్క చెల్లెళ్ల హత్యలు వెనుక కారణాలు ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి.

ప్లస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్, నటీనటుల నటన అద్భుతం, హర్రర్ సన్నివేశాలు భయపెట్టాయి.మ్యూజిక్ కూడా బాగుంది.
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా స్లోగా సాగింది.కొన్ని సన్నివేశాలు సిల్లిగా అనిపించాయి.
బాటమ్:
దర్శకుడు ఒకసారి కొత్త కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇలా ఆత్మలతో మాట్లాడటం వంటి సినిమాలు ఇదివరకే ప్రేక్షకుల ముందుకు ఎన్నో వచ్చాయి కానీ ఈ సినిమా కాస్త ఆసక్తిని కలిగిస్తుంది.