మన దేశంలో చాలామంది ఆటో డ్రైవర్లు( Auto Driver ) గర్భవతులకు ఉచితంగా ఆటోలో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు.అయితే ఒక ఆటో డ్రైవర్ మాత్రం ఆడపిల్ల పుడితే( Baby Girl ) ఆ ఆడపిల్ల పుట్టినరోజు నుంచి ఆరు నెలల వరకు తన ఆటోలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నారు.
ఈ ఆటో కుర్రాడి మంచితనం గురించి సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
ఈ భైంసా ( Bhainsa ) ఆటో కుర్రాడు తన మంచితనంతో ప్రశంసలను సొంతం చేసుకుంటున్నారు.
భైంసాలో నివశించే కాంబ్లే సాహెబ్ రావు( Kamble Saheb Rao ) ఆర్థిక సమస్యల వల్ల చదువుకు దూరమయ్యాడు.ఒకానొక సమయంలో కాంబ్లే సాహెబ్ రావు ఫ్రెండ్ కు కూతురు పుట్టిన కొన్నిరోజుల తర్వాత కూతురుకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి.
సకాలంలో ఆస్పత్రికి తీసుకొని వెళ్లక పోవడం వల్ల ఆ పాప మృతి చెందింది.ఈ ఘటన సాహెబ్ రావును ఎంతో బాధ పెట్టింది.

ఇలాంటి ఘటన మరో పాప విషయంలో జరగకూడదని సాహెబ్ రావు భావించారు.ఆడపిల్ల పుట్టిన తేదీ( Baby Girl Birthday ) నుంచి ఆరు నెలల వరకు తన సొంత ఆటోలో చెకప్ కు తీసుకెళుతూ ఈ వ్యక్తి ప్రశంసలను అందుకోవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.బాలింతలకు కూడా సాహెబ్ రావు ఫ్రీ సర్వీస్ అందిస్తున్నారు.తాను నివశించే ప్రాంతంలో ఫోన్ చేసి ఎవరు సహాయం కోరినా సాహెబ్ రావు వెంటనే స్పందిస్తున్నారు.

వందల మందికి సహాయం చేసినా కాంబ్లే సాహెబ్ రావు మాత్రం పబ్లిసిటీకి దూరంగా ఉంటున్నారు.ఇప్పటికే వందల మందికి సహాయం చేసిన కాంబ్లే సాహెబ్ రావు రాబోయే రోజుల్లో ఎంతోమందికి సహాయం చేయాలని భావిస్తున్నారు.సాహెబ్ రావు కెరీర్ పరంగా మరింత ఎదిగి ఎంతోమందికి సహాయం చేయాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.







