అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం భగవంత్ కేసరి(Bhagavanth Kesari) ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.ఇక ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ విడుదల కానున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే సినిమా నుంచి విడుదలైనటువంటి పోస్టర్స్ టీజర్ ట్రైలర్ అలాగే పాటలు కనుక చూస్తే బాలకృష్ణ ఖాతాలో మరొక సూపర్ హిట్ సినిమా పడటం ఖాయమని అందరూ భావిస్తున్నారు.ఇక ఈ సినిమా హిట్ అవ్వడం ముఖ్యంగా ఇద్దరికీ చాలా కీలకంగా మారిందని కూడా చెప్పాలి.
భవిష్యత్తులో వారి సినీ కెరియర్ ఏంటి అనే విషయాన్ని కూడా ఈ సినిమా నిర్ణయించబోతుందని తెలుస్తుంది.మరి ఈ సినిమా ఎవరి సినీ కెరీర్ కు కీలకంగా మారింది అనే విషయానికి వస్తే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నటువంటి ఎస్ ఎస్ తమన్(SS Taman) కి సినిమా ఎంతో కీలకమని చెప్పాలి.
ఈయన ఈ ఏడాది వచ్చినటువంటి ఏ సినిమా ద్వారా కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు.ఇక తాజాగా స్కంద సినిమా( Skanda ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పరిమితికి మించి బిజిఎం ఇచ్చారు అంటూ ఈయన పట్ల విమర్శలు కూడా వచ్చాయి.

ఇలా తమన్ సంగీత సారథ్యంలో వచ్చిన సినిమాలన్నీ కూడా ఏదో ఒక రీమార్క్ ప్రభావం చూపుతూనే ఉన్నాయని చెప్పాలి.ఇక ఈ సినిమా కనుక మంచి సక్సెస్ అయితే తన కెరీర్ కు ఎలాంటి డోకా ఉండదని లేకపోతే తన కెరీర్ ఇబ్బందులలో పడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పాలి.అందుకే ఈ సినిమా విజయం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి ఎంతో కీలకంగా మారింది.అలాగే హీరోయిన్ శ్రీ లీలకి కూడా ఈ సినిమా విజయం ఎంతో అవసరం.
ఈమె ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

సినిమా తర్వాత శ్రీ లీల (Sreeleela) దాదాపు పది సినిమాలకు పైగా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా అయ్యారు.అయితే ఈమె నటించిన స్కంద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేదు.ఈ క్రమంలోనే భగవంత్ కేసరి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ఈ సినిమా కనుక హిట్ కాకపోతే తనపై నెగిటివ్ కామెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అందుకే ఈ సినిమా విజయం శ్రీలీలకు కూడా చాలా కీలకంగా మారిందని చెప్పాలి.







