నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) ప్రజెంట్ నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భగవంత్ కేసరి( Bhagavanth Kesari )”.ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.
దసరా బరిలో భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.వరుసగా సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ మధ్య వరుసగా ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమాపై భారీ హైప్ పెంచేస్తూ ఉన్నారు.ఇటీవలే ట్రైలర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ట్రైలర్ తో అప్పటి వరకు ఉన్న అంచనాలు డబల్ అయ్యాయి.ఇలా టీజర్, సాంగ్స్, ట్రైలర్ అన్ని కూడా ఆడియెన్స్ ను బాగా అలరించడంతో ఈ సినిమా కోసం ఆడియెన్స్ అంత ఎదురు చూస్తున్నారు.

అందులోనూ దసరా బరిలో రాబోతుంది.దీంతో అందరికి సెలవు దినాలు ఉంటాయి కాబట్టి చిన్న పెద్ద అందరు ఎంజాయ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.అనిల్ సినిమా అంటే కామెడీ తప్పకుండ ఉంటుంది.దీంతో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పిస్తుంది అని అనుకుంటున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని రన్ టైం కూడా లాక్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాకు డీసెంట్ రన్ టైం లాక్ అయినట్టు తెలుస్తుంది.టోటల్ గా 155 నిముషాల నిడివిగా ఈ సినిమాను కట్ చేసినట్టు తెలుస్తుంది.అంటే 2 గంటల 35 నిముషాలు.
మరి ఆడియెన్స్ ను ఈ మూవీ ఎలా అలరిస్తుందో వేచి చూడాలి.కాగా దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ కానున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కూతురు రోల్ లో శ్రీలీల( Sreeleela ), విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.
ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా థమన్ సంగీతం అందించారు.







