నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) జూన్ 10న తన పుట్టిన రోజును జరుపుకోనున్నారు.ఈ సందర్భంగా ఈయనకు ఫ్యాన్స్ నుండి అప్పుడే శుభాకాంక్షల వెల్లువ మొదలైంది.
ఇక రేపు సోషల్ మీడియాలో ప్రముఖులు, ఫ్యాన్స్ విశేష్ తో సందడి మాములుగా ఉండదు.ఇదిలా ఉండగా ఈయన ప్రస్తుతం నటిస్తున్న సినిమా నుండి కూడా అదిరిపోయే అప్డేట్ రానుంది.
ప్రజెంట్ నందమూరి బాలయ్య అనిల్ రావిపూడి ( Anil Ravipudi )దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకే ”భగవంత్ కేసరి” అనే టైటిల్ ను అనౌన్స్ చేసారు.
ఇక ఇక్కడితో ట్రీట్ అయిపోలేదు అని రేపు బర్త్ డే రోజు మరో బ్లాస్టింగ్ అప్డేట్ ఉందని అనిల్ తెలిపాడు.మరి అది ఫస్ట్ టీజర్ అని తెలుస్తుంది.
ఈ టీజర్ కు తాజాగా టైం లాక్ చేసారు.

రేపు అంటే జూన్ 10న ఉదయం 10.19 నిముషాలకు 108 థియేటర్స్ లో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.ఈ టీజర్ కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తుంది.
మరి థమన్ కూడా ఈసారి స్పీకర్స్ బద్దలవ్వడం ఖాయం అని హైప్ పెంచేసాడు.చూడాలి ఈ టీజర్ గ్లింప్స్ ఎలా ఉంటుందో.

ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్( Kajal Agarwal ) హీరోయిన్ గా నటిస్తుండగా.బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తున్న విషయం విదితమే.అలాగే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తుండగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది.








