ఐఫా అవార్డులలో సత్తా చాటిన బాలయ్య భగవంత్ కేసరి... ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) తాజాగా అనిల్ రావిపూడి( Anil Ravipudi )డైరెక్షన్లో నటించిన భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈ సినిమా గత ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తండ్రి కూతుర్ల సెంటిమెంట్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమాలో శ్రీ లీల ( Sreeleela ) బాలకృష్ణ ( Balakrishna ) కు కూతురి పాత్రలో నటించగా కాజల్ అగర్వాల్ బాలయ్యకు జోడిగా నటించారు.

ఇలా ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేసిన ఈ సినిమా ఇటు థియేటర్లలోను అటు బుల్లితెరపై కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఇకపోతే తాజాగా ఐఫా అవార్డులలో కూడా ఈ సినిమా ఏకంగా నాలుగు విభాగాలలో నామినేషన్స్ లో నిలవడం విశేషం.సినీ ఇండస్ట్రీలో నటించే సెలబ్రిటీలను గౌరవిస్తూ ప్రతి ఏడాది వారికి ఎన్నో రకాల అవార్డులను అందజేస్తూ ఉంటారు.

ఇలాంటి అవార్డులలో ఐఫా అవార్డులు ( IIFA Awards ) కూడా ఒకటి.ఇక ఈ ఏడాది ప్రకటించబోయే ఐఫా అవార్డులలో భాగంగా భగవంత్ కేసరి సినిమా ఏకంగా నాలుగు విభాగాలలో నిలిచింది.

Advertisement

ఈ అవార్డు వేడుకలలో భాగంగా బెస్ట్ సినిమాగా అలాగే బెస్ట్ ఫిమేల్ రోల్, బెస్ట్ మేల్ రోల్, అలాగే డైరెక్టర్గా 4 క్యాటగిరీలలో ఈ సినిమా నామినేషన్ లో నిలవడంతో చిత్ర బృందం అలాగే అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి త్వరలోనే జరగబోయే ఈ వేడుకలలో భాగంగా భగవంత్ కేసరి సినిమా ఎన్ని అవార్డులను అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబి డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా ఎన్బీకే 109 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఈ సినిమా ఈ ఏడాది చివరిన లేదా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు