పెద్దయ్యాక నేను సమంత అవుతాను.. భగవంత్ కేసరి చిన్నారి ఊహ కామెంట్స్ వైరల్!

భగవంత్ కేసరి సినిమాలో ఇద్దరు చిన్నారులు( Bhagavanth kesari ) నటించిన సంగతి తెలిసిందే.విజ్జిపాప చిన్నప్పటి పాత్రలో నైనిక నటించగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సీన్ లో ఊహ అనే చిన్నారి నటించారు.

 Bhagavanth Kesari Kid Ooha Comments Goes Viral In Social Media Details Here , Bh-TeluguStop.com

భగవంత్ కేసరి సక్సెస్ మీట్ లో భాగంగా చిన్నారి ఊహ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.ఊహ మాట్లాడుతూ హాయ్ అందరికీ నమస్తే అంటూ క్యూట్ గా చెప్పుకొచ్చారు.

మా డైరెక్టర్ సార్ కు నమస్తే.అందరికీ నమస్తే.నాతోని బాలకృష్ణ( Balakrishna ) మంచిగా ఉన్నారు.షూటింగ్ దగ్గర నాతోని మంచిగా మాట్లాడుతూ ఉన్నారు.మంచిమంచిగా ఆడుకున్నారు. శ్రీలీల ఐ లవ్ యూ అని ఊహ చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత అనిల్ రావిపూడి స్టేజ్ పైకి వచ్చి ఈ పిల్లలు ఇద్దరూ అక్కడ కూర్చుని ఉన్నారని మధ్యలో ఐదుసార్లు అటూఇటూ సిటీ బస్ లా తిరిగారని అనిల్ రావిపూడి అన్నారు.

తిరుగుతూ మమ్మల్ని స్టేజ్ ఎక్కించాలని అడిగారని ఊహ నా జుట్టు పట్టుకుని లాగి నన్ను ఎక్కించవా స్టేజ్ అంటూ బుంగమూతి పెట్టాను అంటూ మూతి తిప్పుకుందని అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కామెంట్లు చేశారు.ఆ తర్వాత ఊహ బుంగమూతి పెట్టి చూపించడం గమనార్హం.ఆ తర్వాత ఊహ నేను పెద్దయ్యాక సమంత అవుతానని అన్నారు.

చిన్నారి ఊహ చెప్పిన క్యూట్ మాటలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.భగవంత్ కేసరి బాక్సాఫీస్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది.

ఈరోజు కలెక్షన్లతో ఈ సినిమా కలెక్షన్లు 100 కోట్ల గ్రాస్ దాటే ఛాన్స్ ఉంది.థియేటర్లలో సరైన సినిమా లేకపోవడం ఈ సినిమాకు కలిసొస్తోంది.

భగవంత్ కేసరి కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అటు బాలయ్య ఇటు అనిల్ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలవడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube