తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.అయితే గతంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీ మారుతారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.