పింక్ బాల్ టెస్టులో తేలిపోయిన టీమిండియా.. ఆస్ట్రేలియా ఘన విజయం

బోర్డర్ భాస్కర్ ట్రోఫీలో( Border Bhaskar Trophy ) భాగంగా ఐదు టెస్టులలో టీమిండియా( Team India ) మొదటి టెస్టులో విజయం సాధించగా, రెండో టెస్టులు మాత్రం చతికల పడింది.అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

 Bgt India Lost To Australia In Pink Ball Test Details, Ind Vs Aus, Nithish Kumar-TeluguStop.com

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి రోజే 180 పరుగులకు కుప్పకూలింది.ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా( Australia ) జట్టు భారీ స్కోరు సాధించింది.

ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 331 ఆల్ అవుట్ అయింది.దీంతో ఆస్ట్రేలియాను మొదటి న్యూస్ లో భారీ ఆధిక్యం లభించింది.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో కూడా ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

Telugu Bhaskar Trophy, Ind Aus, India, Mitchell Starc, Nithishkumar, Pat Cummins

ఆ తర్వాత మొదలైన మూడో రోజు ఆటలో టీమిండియా వరుస వికెట్లు పడడంతో రెండో ఇన్నింగ్స్ లో 175 ఆల్ అవుట్ అయింది.దింతో కేవలం 19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది టీమిండియా.ఇక స్వల్ప లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది ఆస్ట్రేలియా.

రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ విజయాన్ని అందుకుంది.ఈ టెస్ట్ మ్యాచ్ లో మిచెల్ స్టార్క్( Mitchell Starc ) మొదటి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు తీయడంతో భారత్ కు గట్టి దెబ్బ తగిలింది.

ఇలా రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమ్మిన్స్( Pat Cummins ) ఐదు వికెట్లతో టీమిండియాను తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు.

Telugu Bhaskar Trophy, Ind Aus, India, Mitchell Starc, Nithishkumar, Pat Cummins

మరోవైపు బోలాండ్ 3 వికెట్లు, మెచల్ స్టార్ కు రెండు వికెట్లతో టీమిండియాను కేవలం 175 పరుగులకే ఆల్ అవుట్ చేశాడు.హైదరాబాద్ కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి మొదటి ఇన్నింగ్స్ లో 42 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు.

ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి టాప్ బ్యాట్స్మెన్లు సింగల్ డిజిట్ కే వెనుతిరగడంతో టీమిండియా గోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.దీంతో టీమ్ ఇండియా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో మూడో స్థానానికి దిగజారింది.

ఆస్ట్రేలియా ఈ విజయంతో మొదటి స్థానానికి దూసుకు వెళ్లగా రెండో స్థానంలో సౌత్ ఆఫ్రికా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube