పత్తి పంటలో అధిక దిగుబడికొసం మెరుగైన నూతన పద్దతులు..!

ప్రధాన వాణిజ్య పంటలలో ముఖ్యమైన పంటగా పత్తి పంటకు పేరు ఉంది.పత్తి నుండి వస్త్రాలు, గింజల నుండి నూనె తయారు చేయడం వల్ల మార్కెట్లో ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.

 Better New Methods For High Yield In Cotton Crop, Cotton,  Cultivation , High  Y-TeluguStop.com

సాధారణంగా అయితే నల్లరేగడి నేలలు( Black soils ), నీటి వసతులు ఉంటే ఎటువంటి నేలలైన పత్తి పంటకు అనుకూలంగా ఉంటాయి.

పత్తి విత్తనాలను( Cotton ) ఏప్రిల్ లేదా మే నెలలో విత్తు కోవాలి.

పత్తి పంటకు ఉప్పు నేలలు, నీరు నిల్వ ఉండే నేలలు అనుకూలంగా ఉండవు.వర్షాల నీరు పొలంలో ఆగకుండా తొందరగా బయటికి వెళ్లేటట్లు నేలను కాస్త ఏటవాలుగా చదువులు చేసుకోవాలి.

ఇక ఎరువుల ఈ విషయానికి వస్తే ఎకరానికి ఐదు టన్నుల వరకు వేసుకోవాలి.వీటితోపాటు ఐదు కిలోల వేపపింది ఒక కిలో అజోస్పైరిల్లం + ఒక కిలో అజోఫాస్ వేయడంతో నేలలో సేంద్రియ పదార్థాల శాతం పెరుగుతుంది.

నేలలో మొక్కల మధ్య దూరం 60 సెంటీమీటర్లు వరుసల మధ్య దూరం 90 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తుకోవాలి.పత్తి విత్తనాలు నాటే సమయంలో నెలలో తేమ ఉండాలి.ఎకరాకు దాదాపుగా ఒక కిలో విత్తనాలు అవసరం.విత్తిన వారం రోజులకు ఒక నీటి తడి అందించాలి.పొలంలో కలుపు మొక్కలు పెరగకుండా 20 లీటర్ల నీటిలో ఒక లీటరు పెండింగ్ మెథాలిన్ 30% తో పిచికారి చేసుకోవాలి.పత్తి పంటలో మొక్కల మధ్య, వరుసల మధ్య దూరం ఉండడం వల్ల సూర్యరశ్మి, గాలి బాగా తగిలి మొక్కకు అధికంగా కొమ్మలు రావడంతో అధిక దిగుబడి ( High yield )పొందవచ్చు.

మొదటిసారి పత్తి పంట చేతికి వచ్చాక నాలుగైదు రోజుల తరువాత నీటిని పారించాలి.పైన చెప్పిన పద్ధతులు సరైన క్రమంలో పాటిస్తూ ఏమైనా అనుమానాలు ఉంటే వ్యవసాయ క్షేత్ర నిపుణుల సలహాతో అధిక దిగుబడి పొంది మంచి ఆదాయం అర్జించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube