మామిడి పండ్లును అమితంగా ఇష్టపడతారా? ఇలా తీసుకుంటే మరిన్ని హెల్త్ బెనిఫిట్స్!

ప్రస్తుత వేసవి కాలంలో విరివిరిగా లభ్యమయ్యే పండ్లలో మామిడి పండ్లు ముందు వరుసలో ఉంటాయి.ఇంకా చెప్పాలంటే ఇది మామిడిపండ్ల సీజన్ అని కూడా అంటుంటారు.

ఇక పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు అందరూ మామిడి పండ్లును అమితంగా ఇష్టపడుతుంటారు.రుచిలోనే కాదు మామిడి పండ్ల ద్వారా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందొచ్చు.

అయితే మామిడి పండ్లును నేరుగా కాకుండా ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.మరి ఇంకెందుకు లేటు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే మామిడి పండ్లను ఎలా తీసుకోవాలో చూసేయండి.

ముందుగా ఒక మామిడి పండును( Mango fruit ) తీసుకుని పీల్ తొల‌గించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక చిన్న సైజు క్యారెట్ ని తీసుకుని పీల్ తొలగించి వాట‌ర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు, క్యారెట్ ముక్కలు, చిటికెడు పసుపు, ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజలను( Sabja seeds ) యాడ్ చేసి సేవించాలి.ఈ మ్యాంగో క్యారెట్ జ్యూస్( Carrot juice ) టేస్ట్ గా ఉండడమే కాదు హెల్త్ కు ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా వెయిట్ లాస్ కు సూపర్ ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

అలాగే వేసవిలో బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది.

వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

అలాగే ఈ మ్యాంగో క్యారెట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.కంటి చూపు రెట్టింపు అవుతుంది.

మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ కావడంతో డబ్బులు వెనక్కు ఇచ్చేసిన హరీష్ శంకర్.. ఎన్ని రూ.కోట్లంటే?
ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి

జుట్టు రాలడం త‌గ్గు ముఖం పడుతుంది.చర్మం యవ్వనంగా నిగారింపుగా మెరుస్తుంది.

Advertisement

కాబట్టి మామిడి పండ్లను నేరుగానే కాదు ఇలా కూడా తీసుకునేందుకు ప్రయత్నించండి.వేసవిలో ఆరోగ్యంగా జీవించండి.

తాజా వార్తలు